Begin typing your search above and press return to search.

రాజస్థాన్ లో బీకాంలో ఫిజిక్స్ మంత్రి.. చంద్రయాన్ పై వింత వ్యాఖ్య!

ఈ సమయంలో చంద్రయాన్ - 3 పట్ల తన సంతోషాన్ని కూడా తెలపాలని, ఇస్రో బృంధాన్ని అభినందించాలని భావించారు రాజస్థాన్ క్రీడల మంత్రి అశోక్ చంద్న!

By:  Tupaki Desk   |   24 Aug 2023 5:27 AM GMT
రాజస్థాన్  లో బీకాంలో ఫిజిక్స్  మంత్రి.. చంద్రయాన్  పై వింత వ్యాఖ్య!
X

కొన్ని సార్లు చాలా మంది రాజకీయ నాయకులు తమదైన అర్ధజ్ఞానంతో రకరకాల వ్యాఖ్యలు చేసి బలైపోతుంటారు! ఈ క్రమంలో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 'బీకాం లో ఫిజిక్స్' ఎంత ఫేమస్సో చెప్పే పనిలేదు. ఈ క్రమంలో తాజాగా రాజస్థాన్ మంత్రి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి నెటిజన్ల కీబోర్డులకు బలైపోతున్నారు!

అవును... చంద్రుడిపై చంద్రయాన్ - 3 సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వటం పట్ల దేశవ్యాప్తంగా ఆనందోత్సవాలు వెల్లువిరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో చంద్రయాన్ - 3 పట్ల తన సంతోషాన్ని కూడా తెలపాలని, ఇస్రో బృంధాన్ని అభినందించాలని భావించారు రాజస్థాన్ క్రీడల మంత్రి అశోక్ చంద్న!

ఇందులో భాగంగా... "చంద్రయాన్ -3 సక్సెస్ కావడం సంతోషంగా ఉంది. అందులో వెళ్లిన యాత్రికులకు సెల్యూట్ చేస్తున్నా. సైన్స్, స్పేస్ రీసెర్చ్ లో మన దేశం మరింత ముందుకు వెళ్లింది. భారతీయులందరికీ శుభాకాంక్షలు" అని అన్నారు. ఈ ఒక్క మాటతో ఆటాడుకుంటున్నారు నెటిజన్లు.

చంద్రయాన్ - 3 లో యాత్రికులు అంటూ మంత్రి గారు చేసిన వ్యాఖ్యలతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చంద్రయాన్ లో యాత్రికులు ఎక్కడి నుంచి వచ్చారబ్బా అని జట్టు పీక్కుంటున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఆ విషయం చెప్పడం మరిచిపోయారేమో అంటూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.

దీంతో రాష్ట్ర మంత్రికి ఇంత గొప్ప విషయంపై కనీస అవగాహన కూడా లేదన్న మాట అంటూ నెటిజన్లు ఒక కన్ క్లూజన్ కి వచ్చేశారు. ఇలాంటి వ్యక్తులు మంత్రులుగా ఉండబట్టే... చంద్రయాన్ - 3 సక్సెస్ అయ్యిందంటూ వెటకారమాడుతున్నారు.

కాగా... కోట్ల మంది భారతీయులతో పాటు యావత్ ప్రపంచం తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్-3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇస్రో... ఇప్పటివరకు ఎవరూ దిగని చంద్రుడి దక్షిణ ధృవంపై కాలు మోపింది. దీంతో ప్రపంచ యవనికపై భారత పతాకం రెపరెపలాడింది.