Begin typing your search above and press return to search.

వివాహేతర శృంగారం నేరం కాదు.. హైకోర్టు స్పష్టం!

అవును... ఇద్దరు పెద్దలు వివాహం అనంతరం పరస్పర సమ్మతితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది

By:  Tupaki Desk   |   3 April 2024 3:51 AM GMT
వివాహేతర శృంగారం నేరం కాదు.. హైకోర్టు స్పష్టం!
X

ఇద్దరు పెద్దవారు (మేజర్లు) పరస్పర అంగీకారంతో శృంగరం (వివాహేతర సంబంధం) చేస్తే దాన్ని నేరంగా పరిగణించలేమని రాజస్థాన్ హైకోర్టు తీర్పు చెప్పింది. పరస్పర అనుమతితోనే వారు శృంగారంలో పాల్గొంటారు కాబట్టి... అది నేరం కాదని స్పష్టం చేసింది!

అవును... ఇద్దరు పెద్దలు వివాహం అనంతరం పరస్పర సమ్మతితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది! తన భార్యను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ని విచారించిన రాజస్థాన్ హైకోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది.

అయితే... ఈ కేసు వేసిన వ్యక్తి వేరే కేసులో జైల్లో ఉండటంతో... అతని భార్య కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సంచలనంగా స్పందించింది! ఇందులో భాగంగా... తనను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేయలేదని, ఎవరూ కిడ్నాప్ చేయలేదని, నిందితుల్లోని ఒకరితో తాను లివ్-ఇన్-రిలేషన్ లో ఉన్నట్లు ఆమె కోర్టుకు వెల్లడించింది!

దీంతో... తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు సదరు మహిళ స్వయంగా ఇప్పుకుందని.. అందువల్ల ఆమెపై ఐపీసీ సెక్షన్ 494, 497 (వ్యభిచారం) కింద నేరంగా భావించి శిక్షించాలని, సామాజిక నైతికతను కాపాడేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు! ఈ సందర్భంగా స్పందించిన న్యాయస్థానం... ఆమె చేసినపనిని నేరంగా పరిగణించలేమని తెలిపింది!

ఇదే సమయంలో... ఇరువైపులా వాదనలు విన్న జస్టీస్ బీరేంద్ర కుమార్ తుది తీర్పును వెలువరించారు. ఇందులో భాగంగా... పరస్పర అంగీకారంతో, ఇష్టంతో జరిగే వివాహేతర శృంగారం నేరం కిందకు రాదని.. సదరు మహిళ చేసిన పనిని నేరంగా పరిగణించలేమని తెలిపారు! అయితే... వివాహేతర సంబంధం నేరం కాకపోయినా.. నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపించి విడాకులు తీసుకోవచ్చని సూచించారు!

ఇదే క్రమంలో... సెక్షన్ 497 ప్రకారం వివాహేతర సంబంధాలు వ్యభిచారం పరిధిలోకి వస్తాయని తెలిపిన ఆయన... ఈ అంశం రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ 2018లోనే సుప్రీంకోర్టు రద్దుచేసినట్లు గుర్తు చేశారు.!