Begin typing your search above and press return to search.

ఇద్దరు గ్యాంగ్ స్టర్ల లవ్ మ్యారేజ్... కోర్టు కండిషన్ ఇదే!

వివరాళ్లోకి వెళ్తే... హరియాణాకు చెందిన సందీప్ అలియాస్ కాలా జథేడి, రాజస్థాన్ కు చెందిన అనురాధా చౌధరీ అలియాస్ మేడం మింజ్ లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారంట.

By:  Tupaki Desk   |   7 March 2024 4:46 AM GMT
ఇద్దరు గ్యాంగ్  స్టర్ల లవ్  మ్యారేజ్... కోర్టు కండిషన్  ఇదే!
X

సుమారు డజన్ల కొద్దీ కేసులున్న ఇద్దరు గ్యాంగ్ స్టర్లు ప్రేమలో పడ్డారు! సుమారు నాలుగేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారు. జైల్లో ఉన్నా జైలు బయట ఉన్నా వీరు ప్రేమలో మునిగి తేలుతున్నారు! ఈ సమయంలో తాజాగా వారి వివాహానికి ఊహించని రీతిలో అన్నట్లుగా అనుమతి దొరికింది. దీంతో వీళ్లిద్దరూ ఎవరు, వీళ్లపై ఉన్న కేసులు ఏమిటి, కోర్టు ఇచ్చిన అనుమతి ఎంత కాలం అనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... సుమారు నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఇద్దరు గ్యాంగ్ స్టర్లు మరో నాలుగైదు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. డజన్ల కొద్దీ కేసులను ఎదుర్కొంటున్న వీరి ప్రేమ వివాహం, అందుకు కోర్టు ఇచ్చిన అనుమతి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ నెల 12న వీరి వివాహం జరగనుందని తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... హరియాణాకు చెందిన సందీప్ అలియాస్ కాలా జథేడి, రాజస్థాన్ కు చెందిన అనురాధా చౌధరీ అలియాస్ మేడం మింజ్ లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారంట. వీరిలో సందీప్.. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు అత్యంత సన్నిహితుడు కాగా... 2017లో పోలీసుల ఎన్ కౌంటర్ లో మృతిచెందిన గ్యాంగ్ స్టర్ ఆనంద్ పాల్ సింగ్ వద్ద పనిచేసిన అనుభవం అనురాధకు ఉంది.

ఇందులో దోపిడి, హత్య, హత్యాయత్నం వంటివి సుమారు డజనుకు పైగా కేసులు సందీప్ పై ఉండగా... కిడ్నాప్, మనీ ల్యాండరింగ్, బెదిరింపులు వంటి పలు కేసులను అనురాధ ఎదుర్కొంటుంది! ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమలో పడి 2020లో పరారై పోలీసులనుంచి తప్పించుకుని పలు రాష్ట్రాల్లో తిరిగారు. ఈ క్రమంలో 2021 జూలైలో పట్టుబడ్డారు.

ఈ క్రమంలో కొంతకాలం తర్వాత బెయిల్ పై అనురాధ బయటకు వచ్చింది. ఈ సమయంలో సందీప్ తో ఆమె పెళ్లి మార్చి 12న సోనీపత్ లో జరగనుంది. వీరి పెళ్లికి కోర్టు 6 గంటల పెరోల్ అనుమతి ఇచ్చింది. దీంతో వీరి ప్రేమ వివాహం, అందుకు కోర్టు ఇచ్చిన 6 గంటల అనుమతి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.