Begin typing your search above and press return to search.

బ్లాక్ అవుట్ వేళ.. సెల్ ఫోన్ వెలుగులో వారి పెళ్లి

తాజా ఉద్రికత్త పరిస్థితుల గురించి తెలియని వేళ.. పెళ్లి వేడుక హడావుడిగా సాగుతోంది. సరిగ్గా తాళి కట్టే వేళకు ఒక్కసారిగా కరెంట్ కట్ అయ్యింది.

By:  Tupaki Desk   |   11 May 2025 10:26 AM IST
బ్లాక్ అవుట్ వేళ.. సెల్ ఫోన్ వెలుగులో వారి పెళ్లి
X

పహల్గాం ఉగ్రదాడికి బదులు చెప్పేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. తదనంతర పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురువారం రాత్రి హటాత్తుగా భారతదేశ సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్ని టార్గెట్ చేస్తూ ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించటం.. వైమానిక దాడులు చేపట్టటం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్లాక్ అవుట్ చేపట్టి.. ప్రజల్ని అప్రమత్తం చేశారు.ఈ దాడుల వేళ కొన్ని అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి.

కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఉదంతాల్లో ఇదొకటి. రాజస్థాన్ సరిహద్దు జిల్లాలో గురువారం రాత్రి ఒక పెళ్లి వేడుక జరుగుతోంది. తాజా ఉద్రికత్త పరిస్థితుల గురించి తెలియని వేళ.. పెళ్లి వేడుక హడావుడిగా సాగుతోంది. సరిగ్గా తాళి కట్టే వేళకు ఒక్కసారిగా కరెంట్ కట్ అయ్యింది. పాక్ దాడులకు అలెర్టుగా విద్యుత్ సరఫరాను నిలిపి వేసి.. బ్లాక్ అవుట్ చేపట్టారు.

అయితే.. పెళ్లిలె కీలక ఘట్టం జరుగుతున్న వేళలో కరెంటు పోవటంతో పెళ్లికి వచ్చిన అతిధులు తమ సెల్ ఫోన్ టార్చి వెలుగులో సప్తపది కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అతిధుల సెల్ ఫోన్ టార్చి వెలుతురులోనే ఏడు అడుగులు నడిచేశారు. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా.. అంతటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ పెళ్లిని ఆపకుండా పూర్తి చేశారు. అయితే.. తమకు దేశ భద్రత ముఖ్యమని పెళ్లి కొడుకు.. కుమార్తెల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.