రాజమండ్రి రూరల్‌పై బీజేపీ వర్సెస్ జనసేన..!
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Tupaki Desk | 23 April 2025 5:00 AM ISTఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలు గెలిచినప్పుడు.. తొలి ఎన్నికల ఫలితంఇక్కడ నుంచే వచ్చి.. పార్టీలకు బూస్ట్ ఇచ్చినట్టు అయింది. అయితే.. ఈ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల నాటికి గోరంట్ల బుచ్చయ్యచౌదరి రిటైర్ అవుతారన్న ప్రచారం ఉంది.
వాస్తవానికి గత ఏడాది ఎన్నికల సమయంలోనే రూరల్ నియోజకవర్గాన్ని జనసేన కోరుకుంది. దీంతో ప్రస్తుత మంత్రి కందుల దుర్గేష్ కూడా.. కొన్ని రోజులు అక్కడ ప్రచారం చేసుకున్నారు. అయితే.. ఇదే తనకుచిట్టచివరి అవకాశమని గోరంట్ల మొర పెట్టుకోవడంతో చివరి నిముషంలో మార్పులు చేశారు. దీంతో నిడదవోలు నియోజకవర్గం నుంచి దుర్గేష్ పోటీ చేసి విజయం దక్కించుకున్నారు.
అయితే.. వచ్చే ఎన్నికలకైనా.. గోరంట్ల తన సీటును ఖాళీ చేయడం తప్పదన్న వ్యూహంతో దుర్గేష్.. రూర ల్ నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. తరచుగా ఆయన అనధికారికంగా ఇక్కడ సమావేశాలు నిర్వహించడంతోపాటు.. తన వారిని కూడా ఇక్కడ పెట్టి.. నియోజకవర్గంలో ఏం జరుగుతున్న తెలుసు కుంటున్నారట. అంతేకాదు.. నియోజకవర్గంలో ప్రజలు తమ సమస్యలు వినిపించేందుకు దుర్గేష్ కార్యాలయానికి ఫోన్లు చేసే అవకాశం కల్పించి.. వచ్చే ఎన్నికల నాటికి రంగం రెడీ చేసుకుంటున్నారు.
అయితే.. ఈ క్రమంలోనే బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. తాము మాత్రం తక్కువ తిన్నామా? అంటూ.. బీజేపీ నాయకులు.. రూరల్‌పై పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.గ త ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి విజయం దక్కించుకున్న పురందేశ్వరికి.. బీజేపీ కీలక నాయకుడు ఒకరు సాయం చేశారు. అందరినీ సమన్వయం చేసి.. ఆమె విజయానికి కారణంగా మారారు. దీంతో ఆయన కు గిఫ్టుగా వచ్చే ఎన్నికల్లో రూరల్ టికెట్ ఇప్పించేందుకు పురందేశ్వరి ఇప్పటికే ప్లాన్ చేశారని మరో చర్చ సాగుతోంది.
దీంతో బీజేపీ నేతలు కూడా.. రూరల్‌పై పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పురందేశ్వరి కార్యక్రమాలు కూడా.. తరచుగా అక్కడ జరుగుతుండడాన్ని బట్టి.. బీజేపీ వ్యూహం నిజమేనని స్థానికులు చెబుతున్నారు. మరి ఈ సీటుపై ఎవరు పట్టు పెంచుకుంటారో చూడాలి.
