Begin typing your search above and press return to search.

రామచంద్రరావుకు రాజా సింగ్ దిట్టమైన సవాల్!

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి గుడ్ బై కొట్టిన సంగతి విధితమే ఈ నేపథ్యంలో రాజా సింగ్ తన మాటల దాడిని బీజేపీ మీద కొనసాగిస్తూనే ఉన్నారు.

By:  Tupaki Desk   |   10 July 2025 1:00 AM IST
రామచంద్రరావుకు రాజా సింగ్ దిట్టమైన సవాల్!
X

తెలంగాణా బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ గా రామచంద్రరావు నియమితులైన సంగతి తెలిసిందే. అదే సమయంలో తనను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలేదని చెబుతూ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి గుడ్ బై కొట్టిన సంగతి విధితమే ఈ నేపథ్యంలో రాజా సింగ్ తన మాటల దాడిని బీజేపీ మీద కొనసాగిస్తూనే ఉన్నారు.

ఆయన కొత్త ప్రెసిడెంట్ గా ఒక గట్టి సవాల్ విసిరారు. చెరువుని ఆక్రమించి నిర్మించిన ఫాతిమా కాలేజ్ ని కూల్చేందుకు మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. మజ్లిస్ వారికి చెందిన ఈ కాలేజ్ విషయంలో అధికార కాంగ్రెస్ మెత్తగా వ్యవహరిస్తోందని రాజా సింగ్ ఆరోపించారు. మజ్లీస్ తమకు దోస్తీగా ఉందన్న కారణంతోనే ఇలా చేస్తున్నారు అని అన్నారు.

ఇక దురాక్రమణలు కూల్చివేయాలని ఏర్పాటు చేసిన హైడ్రా అనేక కట్టడాలు భారీ భవనాలను కూల్చివేసింది కానీ ఫాతిమా కాలేజ్ జోలికి పోవడం లేదని ఆయన అన్నారు. ఎందుకంటే అది మజ్లీస్ కి చెందినదే కావడం అని ఆయన అంటున్నారు దానికి హైడ్రా కమిషనర్ రంగనాధ్ చెబుతున్న కారణాలు ఏంటి అంటే పేద విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారని, అందువల్ల దానికి కూలిస్తే పేదలు నష్టపోతారని,

మరి అక్రమ కట్టడాలు అని హైడ్రా ఇప్పటిదాకా కూల్చేసిన అనేక కట్టడాల వల్ల పేదల నివాసాలు ఇళ్ళు కూల్చివేత వల్ల ఎంతో మంది పేదలు ఇబ్బంది పడ్డారని గుర్తు లేదా అని ప్రశ్నించారు. మూసీ నది సుందరీకరణ పేరుతో కూడా అక్కడ పేదల ఇళ్ళను కూల్చేసేందుకు రెడీ అయిన హైడ్రాకు ఫాతిమా కాలేజి విషయంలోనే పేదలు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు.

ఫాతిమా కాలేజి పేదల కోసం ఏర్పాటు చేసినదే అయితే దానిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని సరైన చోట ఏర్పాటు చేసి న్యాయం చేయవచ్చు కదా అని ఆయన అంటున్నారు. ఇక ఎటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫాతిమా కాలేజి జోలికి పోదని తేలుతున్న నేపధ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయినా రంగంలోకి దిగాలని ఆయన కోరారు.

ఆయన మంచి న్యాయవాది అని అన్నారు. పైగా తాను బీజేపీ అధ్యక్షుడిగా డమ్మీని కాదని పవర్ ఫుల్ అని చెబుతున్నారని గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో రామచంద్రరావు తన న్యాయవాద అనుభవాన్ని ఉపయోగించి హైకోర్టులో కేసు వేసి అయినా ఫాతిమా కాలేజి ని కూల్చే విధంగా చర్యలు తీసుకోగలరా అని ప్రశ్నించారు. ఆ సత్తా అచూపాల్సిన సమయం ఇపుడు ఆసన్నం అయింది అని ఆయన అన్నారు.

మరి దీనికి ఆయన రెడీనా అని కూడా రెట్టిస్తున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీ కొత్త అధ్యక్షుడికి గట్టి సవాల్ నే రాజా సింగ్ విసిరారు అని అంటున్నారు. హైడ్రా విషయమే తీసుకుంటే సినీ ప్రముఖులు అని పెద్దలని చూడకుండా చాలా వాటిని కూల్చేసిన వైనాన్ని అంతా తలచుకుంటున్నారు. మరి ఫాతిమా కాలేజి దగ్గర వ్యవహారం ఆగడం అంటే హైడ్రా చిత్తశుద్ధి మీద కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ ఈ విషయంలో ఏమి చేస్తుంది, ఏమి చేయాలని అంటూ రెబెల్ గా మారిన రాజా సింగ్ బిగ్ సౌండ్ చేస్తున్నారు. మరి రామచంద్రరావు ఫాతిమా కాలేజి ఇష్యూని టేకప్ చేస్తారా అన్నదే ప్రశ్నగా ఉంది. చూడాలి ఏమి జరుగుతుందో.