Begin typing your search above and press return to search.

లావణ్య-రాజ్ తరుణ్ వివాదంలోకి మంత్రి?.. మారిన సీన్!

అయితే తనను మరోసారి ఇబ్బంది పెట్టినందుకు ప్రతిగా లావణ్య ఒక సంచలన ఆడియో టేపును బయటపెట్టింది.

By:  Tupaki Desk   |   19 April 2025 4:06 PM IST
Raj Tharun Lavanya Case
X

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆయన మాజీ ప్రేయసి లావణ్యల మధ్య కొనసాగుతున్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన రాజ్ తరుణ్, ప్రస్తుతం వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని లావణ్య ఆరోపించడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా ఈ వివాదానికి సంబంధించి మరో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం లావణ్య నివసిస్తున్న రాజ్ తరుణ్ ఇంటిని ఖాళీ చేయాలంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆ ఇల్లు తమదేనని వారు చెప్పగా, లావణ్య వారిని బయటకు పంపించింది. దీంతో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆ ఇంటి ముందు ధర్నాకు దిగారు.పరిస్థితి అదుపు తప్పుతుండటంతో, పోలీసులు జోక్యం చేసుకుని వారిద్దరినీ లోపలికి అనుమతించాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో లావణ్యకు మరో దారి లేక వారిని ఇంట్లోకి తీసుకెళ్లింది.

అయితే తనను మరోసారి ఇబ్బంది పెట్టినందుకు ప్రతిగా లావణ్య ఒక సంచలన ఆడియో టేపును బయటపెట్టింది. ఆ ఆడియో రికార్డులో రాజ్ తరుణ్, అరియానా కలిసి లావణ్యతో మాట్లాడిన సంభాషణ ఉంది. అందులో అరియానా మాట్లాడుతూ "రాజ్ తరుణ్ మా కుటుంబ సభ్యులలో ఒకరు. అతనితో జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని మా ఇంట్లో కూడా చెప్పేశాను" అని పేర్కొంది. ఈ ఆడియో రికార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది.

ఇంతలోనే ఈ కథకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. గతంలో లావణ్య, రాజ్ తరుణ్ కలిసి ఒక మంత్రి వద్ద రూ. 50 లక్షలు అప్పు తీసుకున్నారట. ఇంటి పత్రాలను తనఖా పెట్టి తీసుకున్న ఈ అప్పులో రూ. 35 లక్షలు రాజ్ తరుణ్ తీసుకోగా, రూ. 15 లక్షలు లావణ్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఇప్పుడు ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. రెండు రోజుల్లో డబ్బులు తిరిగి చెల్లించకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని ఆయన అనుచరులు లావణ్యకు తెలియజేశారట. అంతేకాకుండా, ఇల్లు ఎవరి పేరు మీద ఉందో వారు డబ్బులు చెల్లించకపోయినా లేదా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నా ఇంటిని మంత్రికి అప్పగించాలని, లేదంటే ఖాళీ చేయాలని కూడా స్పష్టం చేశారట.

ఈ కొత్త ట్విస్ట్‌తో లావణ్య, రాజ్ తరుణ్ వ్యవహారం మరోసారి వైరల్ అవుతోంది. అప్పు వ్యవహారం వీరిద్దరి మధ్య మరింత చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.