Begin typing your search above and press return to search.

రాహుల్ అక్కడ చిక్కుకుపోయారు...అందుకే పెళ్ళి చేసుకోలేదు...!

ఇక రాహుల్ ని చూసిన వారు ఎవరూ ఆయన నడివయసు వారు అనుకోరు. పైగా అమ్మాయిలు అయితే మీరు ఎందుకు పెళ్ళి చేసుకోలేదని అంటారు.

By:  Tupaki Desk   |   11 Oct 2023 1:30 AM GMT
రాహుల్ అక్కడ చిక్కుకుపోయారు...అందుకే పెళ్ళి చేసుకోలేదు...!
X

రాహుల్ గాంధీ యాభై ఏళ్ల పైబడిన వారు. అయిన సరే ఆయన పెళ్ళి గురించి ఎపుడూ చర్చ సాగుతూనే ఉంటుంది. రాహుల్ గాంధీకి ప్రధాని పదవి మీద ఆశ ఉందో లేదో తెలియదు. అలాగే పెళ్ళి విషయంలోనూ ఆయన ఎపుడూ బయటపడలేదు. 1970లో పుట్టిన రాహుల్ వయసు ఇపుడు అక్షరాలా 53 ఏళ్ళు. సగటు భారతీయ కుటుంబాలలో అయితే ఇది నడి వయసుగా చూస్తారు.

బాధ్యతల వలయంలో ఉంటూ కిందా మీద అయ్యే వయసు ఇది. కానీ రాహుల్ గాంధీకి పెళ్ళి పేచీ పూచీలు లేకపోవడం వల్ల ఆయన హాయిగానే ఉన్నారు. రోజు రోజుకీ యంగ్ గా మారుతున్నారు. ఆ మధ్యన ఆయన భారత జోడో యాత్ర చేసినపుడు రోడ్డు మీదనే పుషప్స్ యాభై దాకా చేసి ఔరా అనిపించారు. అంతే కాదు ఆయన పిల్లలతో యువకులతో సరిసమానంగా పరిగెడుతూ తన జోరుకు నో బారికేడ్స్ అని చెప్పేశారు.

ఇక రాహుల్ ని చూసిన వారు ఎవరూ ఆయన నడివయసు వారు అనుకోరు. పైగా అమ్మాయిలు అయితే మీరు ఎందుకు పెళ్ళి చేసుకోలేదని అంటారు. ఎపుడు పెళ్ళి చేసుకుంటారని అడుగుతారు. అలాంటి ముచ్చట ఒకటి లేటెస్ట్ గా జరిగింది. దాన్ని రాహుల్ గాంధీ తన సోషల్ మీడియాలో తాజాగా పంచుకున్నారు.

రాహుల్ గాంధీ సెప్టెంబర్ 23న రాజస్థాన్ లోని జైపూర్ మహారాణి కళాశాల విద్యార్ధులతో ఇంటరాక్ట్ అయ్యారు. దానికి సంబంధించిన వీడియోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలను చూస్తే రాహుల్ ని చాలా ప్రశ్నలే స్టూడెంట్స్ అడిగారు అని అర్ధం అవుతోంది.

ముఖ్యంగా విద్యార్ధినులు అయితే రాహుల్ ని అసలు వదలలేదు. మీరు చాలా అందంగా ఉన్నారంటూ రాహుల్ ని పొగడడంతో సిగ్గుపడడం ఆయన వంతు అయింది. ఇంత హుషార్ మీలో ఉంది. అయినా మీరు ఎందుకు పెళ్ళి చేసుకోలేదు అంటూ వారు ఆయన్ని ప్రశ్నించారు. నేను కాంగ్రెస్ పార్టీ పనిలో పూర్తిగా చిక్కుకుని పోయాను అందుకే పెళ్ళి అన్నది ప్రసక్తి రాలేదు అని రాహుల్ జవాబు చెప్పారు.

మరి ఈ సమాధానం ఎంతమందికి నచ్చింది సంతృప్తిగా ఉంది అన్నది కూడా చూడాలి. రాహుల్ గాంధీ 2004లో తొలి సారి ఎంపీ అయ్యారు. అప్పటికే ఆయనకు మూడున్నర పదుల వయసు ఉంది. పెళ్ళి చేసుకునే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వవచ్చు. కానీ అది జరగలేదు. ఇక రాహుల్ ఆ తరువాత కాంగ్రెస్ లో ప్రధాని పోస్టుకు గురి పెట్టి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పదవులు కూడా వద్దు అనేశారు.

నిజంగా 2014 రాహుల్ పెళ్ళి రాజకీయ జాతకాన్ని మలుపు తిప్పిన ఇయర్ గా చెప్పుకోవాలని అంటారు. అప్పటికి రెండు సార్లు యూపీయే గెలిచింది. హ్యాట్రిక్ విజయం కూడా ఖాయం అనుకున్నారు. 2013 దాకా అదే నిజం కూడా. ఎందుకంటే అప్పటికి బీజేపీ గ్రాఫ్ పెద్దగా పెరగలేదు. అద్వానీ వంటి సీనియర్లు పార్టీని నెమ్మదిగా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ సీఎం నుంచి జాతీయ రాజకీయాల్లోకి నరేంద్ర మోడీ అడుగు పెట్టారు.

ఆయన వచ్చాక ఎక్కడలేని జోష్ బీజేపీకి రావడమే కాదు కాంగ్రెస్ కి ధీటైన పార్టీ అన్న ఫోకస్ వచ్చేసింది. అలా 2014లో అనూహ్యంగా బీజేపీ ఫుల్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో రాహుల్ ప్రధాని కధ, పెళ్ళి కళ అలా చెదిరిపోయాయని అంటారు. ఇక 2019 లో జరిగినది తెలిసిందే. ఇపుడు 2024 ఎన్నికలు వచ్చేస్తున్నాయి. రాహుల్ కూడా ఫిఫ్టీస్ లోకి వచ్చేశారు. అందుకే ఆయన కాంగ్రెస్ నే వరించాను అని సింపుల్ గా జవాబు చెప్పి తప్పించుకున్నారు అంటున్నారు.

ఇక ఇదే ఇంటరాక్షన్ లో రాహుల్ కి నచ్చిన వంటకాల గురించి కూడా విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పారు. పాలకూర శనగలు తప్ప అన్నీ తనకు ఇష్టమే అని రాహుల్ చెప్పేశారు. తాను నిరంతర ప్రయాణీకుడిని అని మరో కోణాన్ని రాహుల్ ఆవిష్కరించారు. ఎపుడూ కొత్త ప్రదేశాలు చూసేందుకు ఇష్టపడతాను అని చెప్పారు.

ఇక రాహుల్ అందగాడే. కానీ ముఖానికి ఏ క్రీములూ సబ్బులు ఉపయోగించరట. జస్ట్ అలా ఆయన నీళ్ళతోనే ముఖం కడుగుకుంటారట. అలా నిగారింపు వచ్చేసి ఫేస్ ఎంతో గ్లామర్ గా కనిపిస్తోంది. దటీజ్ ద సీక్రెట్ ఆఫ్ రాహుల్ గ్లామర్ అన్న మాట.