Begin typing your search above and press return to search.

20 కోట్ల ఆస్తులు .. 50 లక్షల అప్పులు

రాయ్ బరేలీ నుండి ఎంపీగా బరిలోకి దిగిన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ

By:  Tupaki Desk   |   4 May 2024 1:00 PM IST
20 కోట్ల ఆస్తులు .. 50 లక్షల అప్పులు
X

రాయ్ బరేలీ నుండి ఎంపీగా బరిలోకి దిగిన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ తనకు అన్ని స్థిర చరాస్తులు కలిపి మొత్తంగా రూ.20 కోట్ల ఆస్తులు, రూ.50 లక్షల అప్పులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు.

అయితే తనకు సొంత ఇల్లు గానీ, సొంత కారు గానీ తెలపడం విశేషం. ఢిల్లీకి సమీపంలోని మెహ్రౌలీలో తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఉమ్మడిగా 3.7 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, గురుగ్రామ్ లోని సిగ్నేచర్ టవర్ లో తనకు ఓ కమర్షియల్ అపార్ట్ మెంట్ ఉందని పేర్కొన్నారు.

రూ. 20 కోట్ల ఆస్తులలో రూ.4.3 కోట్ల విలువైన షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ రూ.3.81 కోట్లు, బ్యాంకులో నగదు రూ.26,25,157, రూ.15 లక్షల విలువైన గోల్డ్ బాండ్స్ సహా మొత్తం రూ. 9,24,59,264 విలువైన చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.

రూ.2.10 కోట్ల విలువైన స్థిరాస్తులు వారసత్వంగా రాగా, రూ.9 కోట్ల విలువైన స్థిరాస్తులను కొనుగోలు చెసినట్లు తెలిపారు.