Begin typing your search above and press return to search.

మహిళల దుస్తులపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు!

అయితే తాజాగా మహిళల దుస్తులపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   27 Feb 2024 12:30 PM GMT
మహిళల దుస్తులపై రాహుల్  గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు!
X

మహిళలు ధరించే దుస్తులపై చాలా మంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు! ప్రధానంగా వారు ఎప్పుడు ఏమి ధరించాలి.. ఎక్కడ ఏమి ధరించకూడదు అంటూ రకరకాల ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయంలో కొంతమంది మతాన్ని అడ్డుపెట్టుకుని వ్యాఖ్యానిస్తే.. మరికొంతమంది పురుషాహంకారంతో వ్యాఖ్యానిస్తుంటారని అంటుంటారు. అయితే తాజాగా మహిళల దుస్తులపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా మహిళల వస్త్రదారణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీకి చెందిన మహిళా విద్యార్థులతో మాట్లాడిన ఆయన... మహిళల దుస్తుల ఎంపికను ప్రతి ఒక్కరూ గౌరవించాలని.. ఒక వ్యక్తి ఏ దుస్తులు ధరించాలో ఇతరులు నిర్దేశించకూడదని తెలిపారు.

భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో కర్ణాటక రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో... ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో ఆ విషయాన్ని ఉద్దేశించి ఓ విద్యార్థిని రాహుల్ గాంధీని ఈ విషయంపై ప్రశ్నించింది. ఇందులో భాగంగా... "మీరు ప్రధాని అయితే..." అని అంటూ ఆ వివాదంపై మీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరింది. దీంతో ఈ విషయంపై స్పందించిన రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఒక మహిళ ఏమి ధరించాలి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయం అని చెప్పిన రాహుల్... అందుకు అంతా అనుమతించాలన్నదే తన అభిప్రాయమని తెలిపారు. ఇదే సమయంలో విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ... "మీరు ఏమి ధరించాలన్నది పూర్తిగా మీ నిర్ణయం.. దాన్ని మరొకరు నిర్దేశించాలని నేను అనుకోవడం లేదు" అని సమాధానం ఇచ్చారు.

కాగా... కర్ణాటకలో గతంలో బీజేపీ అధికారలో ఉండగా... విద్యాసంస్థల్లో హుజాబ్ ధరించడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే... ఆ నిషేదాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... "రాష్ట్రంలోని మహిళలంతా ఎవరు ఏ దుస్తులు ధరించాలి.. ఎవరు ఏమి తినాలి అనేది వారి వారి ఇష్టం. వాళ్లను నేనేందుకు అడ్డుకోవాలి? ఎవరికి నచ్చిన దుస్తులు వారు ధరించడంలో తప్పేముంది?" అని వ్యాఖ్యానించారు.