Begin typing your search above and press return to search.

మళ్లీ తప్పులో కాలేసిన రాహుల్.. ఎన్నికల వేళ ఇదేంది?

తాజాగా ముగిసిన ములుగు బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. గతంలో తాను చేసిన పొరపాటును రిపీట్ చేవారు.

By:  Tupaki Desk   |   19 Oct 2023 4:21 AM GMT
మళ్లీ తప్పులో కాలేసిన రాహుల్.. ఎన్నికల వేళ ఇదేంది?
X

మిగిలిన సందర్భాల లెక్క వేరు. కీలకమైన ఎన్నికల వేళ.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక్క తేడా మాట చాలు.. మొత్తం ఎన్నికల స్వరూపాన్ని మార్చేసేందుకు. పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి కాస్త జోష్ కలిగే వాతావరణం నెలకొందన్న వేళ.. మరింత ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

అందుకు భిన్నంగా కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ.. తన ప్రసంగంలో భాగంగా చేసిన తప్పును చూసి అవాక్కు అవుతున్నారు. ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని హితవు పలుకుతున్నారు.

తాజాగా ముగిసిన ములుగు బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. గతంలో తాను చేసిన పొరపాటును రిపీట్ చేవారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనే రూ.లక్ష కోట్ల అవినీతి చేసిందంటూ కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. గతంలోనే ఆయన ఇదే వ్యాఖ్యలు చేయటం.. ఆయన్ను ట్రోల్ తో ఆడుకోవటం తెలిసిందే. దీనికి కారణం.. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టే రూ.80-80వేల కోట్లు కావటమే దీనికి కారణం.

దీంతో.. ప్రాజెక్టు మొత్తం ఖర్చుకు మించిన అవినీతి ఎలా జరిగిందంటూ ప్రశ్నించటంతో.. రాహుల్ గాలి తీసినట్లైంది. తెలంగాణ అంశాల మీద రాహుల్ గాంధీకి ఏ మాత్రం అవగాహన ఉండదన్నదానికి ఇదో పెద్ద ఉదాహరణగా రాజకీయ ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. తప్పు ఒకసారి చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. మళ్లీ మళ్లీ అదే రిపీట్ చేయటాన్ని ప్రశ్నిస్తున్నారు.

కీలకమైన ఎన్నికల వేళ.. తెలంగాణకు సంబంధించి.. అందునా కేసీఆర్ సర్కారు చేసిన పనుల గురించి విమర్శించే ముందు.. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేదంటే.. అభాసుపాలు కావటం ఖాయం. ఇదంతా ఓకే కానీ.. రాహుల్ చేస్తున్న తప్పుల గురించి.. ఆయనకు ఫీడ్ బ్యాక్ ఇచ్చే వ్యవస్థ లేదా? ఉన్నప్పటికీ.. వారు లైట్ తీసుకుంటున్నారా? అన్నది అసలు ప్రశ్న.