Begin typing your search above and press return to search.

మోడీ - రాహుల్ అఫిడవిట్స్ లో ఈ విషయాలు గమనించారా?

ఇందులో ఇద్దరికీ కొన్ని విషయాల్లో సారూప్యత ఉండటం గమనార్హం! ప్రధానంగా ఇల్లు, కారు వంటి విషయాల్లో మోడీ, రాహుల్ ది ఒకటే పరిస్థితి!!

By:  Tupaki Desk   |   15 May 2024 9:25 AM GMT
మోడీ - రాహుల్  అఫిడవిట్స్  లో ఈ విషయాలు గమనించారా?
X

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొన్న వేళ నేతలు, అధినేతలూ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన చోట చాలా మంది నేతలు హాలిడే మూడ్ లోకి వెళ్లిపోయారు! ఇక ప్రధానంగా రాహుల్ గాంధీ, ప్రధాని మోడీ పాల్గొనబోయే రెండు కీలక నియోజకవర్గాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో... ఇద్దరు నేతలు ప్రచారాల్లో బిజీగా ఉన్నారు.

ఈ సందర్భంగా ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు కీలక నేతలు నామినేషన్స్ దాఖలు చేసేవేల రిటర్నింగ్ అధికారులకు సమర్పించే అఫిడవిట్‌ లో వెల్లడించిన ఆస్తుల వివరాలపై సర్వత్ర ఆసక్తినెలకొంది. ఈ సమయంలో ఇద్దరి ఆస్తుల వివరాలు తెరపైకి వచ్చాయి. ఇందులో ఇద్దరికీ కొన్ని విషయాల్లో సారూప్యత ఉండటం గమనార్హం! ప్రధానంగా ఇల్లు, కారు వంటి విషయాల్లో మోడీ, రాహుల్ ది ఒకటే పరిస్థితి!!

ప్రధాని మోడీ అఫిడవిట్:

తాజాగా వారణాసి లోక్ సభ స్థానంలో పోటీ కోసం ప్రధాని మోడీ దాఖలు చేసిన అఫిడవిట్‌ లో తనకు మొత్తంగా రూ.3.02 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా... తన చేతిలో రూ.52,920 ఉందని పేర్కొన్న మోడీ... గాంధీనగర్‌ లోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎన్‌.ఎస్‌.సీ బ్రాంచ్‌ లో రూ.73,304, వారణాసిలోని శివాజీ నగర్ శాఖలో రూ.7 వేలు ఉన్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో... ఎస్బీఐ లో రూ.2.85 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నట్లు వెల్లడించారు. అదేవిధంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌ లో రూ.9,12,398ను పెట్టుబడిగా పెట్టినట్లు వెల్లడించారు. ఇక తనవద్ద 4 బంగారు రింగులు ఉండగా.. వీటి విలువ రూ.2,67,750 గా ఉన్నట్లు తెలిపారు.

ఇదే క్రమంలో... 2023-24 ఆర్థిక సంవత్సరానికి డిడక్ట్ అయిన ఆదాయపు పన్ను రూ.3,33,179గా అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా తనకు పర్సనల్ లోన్స్ కానీ, కార్లు కానీ, సొంత ఇల్లు కానీ.. వ్యవసాయ భూమిగానీ, వ్యవసాయేతర భూమిగానీ, కమర్షియల్ బిల్డింగ్స్ కానీ ఏమీ లేవని తెలిపిన మోడీ... అప్పులు కూడా లేవని వెల్లడించారు.

ఇదే క్రమంలో... జీవిత భాగస్వామి కాలమ్ కింద "జశోదాబెన్" పేరును వెల్లడించిన మోడీ... ఆమెకు ఉన్న ఆస్తిపాస్తుల వివరాలు తనకు తెలియదని (నాట్ నోన్!) చెప్పడం గమనార్హం!

రాహుల్ గాంధీ అఫిడవిట్:

ఇక రాహుల్ గాంధీ విషయానికొస్తే... మొత్తంగా తనకు రూ.20 కోట్ల వరకు ఆస్తులున్నట్లు ఆయన వెల్లడించారు. 2024 మార్చి 15 నాటికి తన చేతిలో రూ.55 వేలు ఉన్నట్లు తెలిపిన ఆయన... ఎస్‌.బీ.ఐ సేవింగ్స్ అకౌంట్, హెచ్‌.డీ.ఎఫ్‌.సీ సేవింగ్స్ అకౌంట్‌ లో రూ.26,25,157 ఉన్నట్లు తెలిపారు.

పెట్టుబడుల విషయానికొస్తే... యంగ్ ఇండియన్‌ కు చెందిన కంపెనీలో రూ.1,90,000 విలువైన పెట్టుబడులు ఉన్నాయని.. అలాగే ఇతర లిస్టెడ్ కంపెనీల షేర్లలోని వాటా విలువ రూ.4,33,60,519 గా ఉన్నట్లు వెల్లడించారు. వీటితోపాటు ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, హిందూస్తాన్ యూనీలివర్, టైటాన్, టీసీఎస్ వంటి కంపెనీలలో రాహుల్ షేర్లను కొనుగోలు చేసి, పెట్టుబడులు పెట్టారు.

ఇదే క్రమంలో... మ్యూచువల్ ఫండ్స్‌ లో ఉన్న పెట్టుబడుల విలువ రూ.3,81,33,572 గా తెలిపారు. అదేవిధంగా... సావరీన్ గోల్డ్ బాండ్లలో ఉన్న పెట్టుబడుల విలువ మార్చి 15 నాటికి రూ.15,21,740 గా పేర్కొన్నారు. పీపీఎఫ్ అకౌంట్‌ లో రూ.61,52,426 పెట్టుబడులున్నాయని అఫిడవిట్ లో వెల్లడించారు.

అదేవిధంగా... రూ.4,20,850 విలువైన జ్యూవెలరీ, ఇతర విలువైన ఆభరణాలు తన వద్ద ఉన్నట్లు అఫిడవిట్‌ లో తెలిపిన రాహుల్... మొత్తంగా చరాస్తుల కాలమ్ కింద రూ.9,24,59,264 ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఇక స్థిరాస్తుల విషయానికొస్తే... తన సోదరి ప్రియాంక గాంధీ, తనకు కలిపి ఉన్న వ్యవసాయ భూమి, ఫామ్ హౌస్ బిల్డింగ్‌ విలువ రూ.2,10,13,598గా అఫిడవిట్‌ లో తెలిపారు.

కమర్షియల్ బిల్డింగ్స్ కాలమ్ కింద రూ.9,04,89,000 విలువైన ఆస్తులు కలిపి మొత్తంగా స్థిరాస్తుల విలువ రూ.11,15,02,598గా ఉన్నాయి. దీంతో పాటు రూ.49.7 లక్షల అప్పు ఉన్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో తనకు కార్లు లేవని తెలిపారు.