Begin typing your search above and press return to search.

ఏపీని ఫోకస్ చేస్తున్న సూపర్ హిట్ కాంబో....!

తెలంగాణాలో అధికారం పట్టేసిన కాంగ్రెస్ చూపు తప్పకుండా ఏపీ మీద ఉంటుంది. మరో నాలుగైదు నెలలలో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   10 Dec 2023 11:30 PM GMT
ఏపీని ఫోకస్ చేస్తున్న సూపర్ హిట్ కాంబో....!
X

తెలంగాణాలో అధికారం పట్టేసిన కాంగ్రెస్ చూపు తప్పకుండా ఏపీ మీద ఉంటుంది. మరో నాలుగైదు నెలలలో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ ఏపీ టూర్స్ తొందరలో ఖరారు కానున్నాయి. రానున్న నాలుగు నెలలలో నెలకు కచ్చితంగా రెండేసి టూర్లు ఉండేలా రాహుల్ ప్రియాంక తమ షెడ్యూల్ ని రెడీ చేసి పెట్టుకోనున్నారు అని తెలుస్తోంది.

గత అయిదేళ్ల కాలంలో ఏపీలో కొత్త సమస్యలు కూడా చుట్టుకున్నాయి. అవి విభజన తరువాత ఉత్పన్నం అయినవి. దాంతో ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి వంటి వాటికి ఇవి అదనం అన్న మాట. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు అంటూ కొత్త ప్రతిపాదనతో సిద్ధం అయింది.

దాంతో అమరావరి గడచిన నాలుగేళ్ళుగా రగిలిపోతోంది. ఈ నేపధ్యంలో అమరావతిలో ప్రియాంకా గాంధీ పర్యటించి ఏకైక రాజధానికి మద్దతు ఇస్తారని అంటున్నారు. ఇక విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కేంద్రం పెట్టిన కొత్త కుంపటి. ఇది కూడా రగులుతోంది. ఉత్తరాంధ్రాకు ఇజ్జత్ మే సవాల్ గా ఉంది. దాంతో దీని మీద రాహుల్ గాంధీని విశాఖకు రప్పించి పెద్ద ఎత్తున సభ నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ తమ వైపు ఉక్కు ఉద్యమకారులను కార్మికులను ఉత్తరాంధ్రా జనాన్ని తిప్పుకునే ప్రయత్నం చేయనుంది అని తెలుస్తోంది.

అంటే అటు కోస్తా ఇటు ఉత్తరాంధ్రాలో ఒకే సమయంలో కాంగ్రెస్ గేర్ మార్చి స్పీడ్ పెంచనుందని అంటున్నారు. ఈ విషయాలను ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు ప్రకటించారు. రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ కాంబో ఇపుడు సూపర్ హిట్ కాంబోగా ఉంది. ప్రత్యేకించి సౌతిండియాలో ఈ కాంబోకి బ్రహ్మరధం జనాలు పడుతున్నారు. ఇప్పటికే అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కలసి కర్నాటక తెలంగాణాలలో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చారు.

ఇపుడు వారి చూపు ఆంధ్రా మీద పడింది. దాంతో సౌతిండియాలో తమ హవాతో కాంగ్రెస్ గ్రాఫ్ ని ఎక్కడికక్కడ పెంచుతూ హస్తం పార్టీకి సక్సెస్ ని సంపూర్ణం చేయాలని డిసైడ్ అయ్యారు. దాంతో తొందరలోనే రాహుల్ ప్రియాంకా టూర్లు కన్ ఫర్మ్ అవుతాయని గిడుగు రుద్రరాజు చెబుతున్నారు. రానున్న రోజులలో కాంగ్రెస్ ని ఏపీలో లేపేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరో వైపు చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో కూడా కొంత కదలిక కనిపిస్తోంది. ఇటీవల కాలలో లేని హుషార్ కనిపిస్తోంది. నిన్నటికి నిన సోనియా గాంధీ బర్త్ డే వేడుకలను ఏపీలో చాలా చోట్ల నిర్వహించారు. ఇక ఏపీలో వైసీపీ టీడీపీల స్థాయిలో కాకున్నా తామూ ఉన్నాయని రానున్న కాలంలో కాంగ్రెస్ నేతలు ముందుకు వచ్చే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఇక రెండు పార్టీలలో టికెట్లు రాని వారు కానీ ఆశావహులు కానీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు కూడా సిద్ధపడతారు అని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ కదం తొక్కడానికి సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.