Begin typing your search above and press return to search.

రాహుల్ ఎన్డీయేని ఇబ్బంది పెడుతున్నారా ?

కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ ఉన్నారు.

By:  Satya P   |   4 Feb 2026 9:21 AM IST
రాహుల్   ఎన్డీయేని  ఇబ్బంది పెడుతున్నారా ?
X

కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ ఉన్నారు. గాంధీ వంశంలో ఈ రకమైన హోదాను ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీల తరువాత రాహుల్ గాంధీకి మాత్రమే వచ్చింది. అయితే ఇందిరా గాంధీ రాజీవి గాంధీ మొదట ప్రధానులుగా చేసి ఆనక ప్రతిపక్షంలోకి వచ్చారు. రాహుల్ విషయానికి వస్తే ఆయన ప్రధానిగా చేయలేదు, చాన్స్ వచ్చినా కాదనుకున్నారు, ఇక కేంద్ర మంత్రిగా కూడా ఆయన పని చేయలేదు.

వెయిటింగ్ ప్రైమ్ మినిస్టర్ :

2004లో తొలిసారి ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీకి అధికారిక హోదా 2024 దాకా దక్కలేదు, కేబినెట్ హోదాతో కూడా లీడర్ ఆఫ్ అపొజిషన్ గా ఆయన ఉన్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఆయన వెయిటింగ్ ప్రేమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ట్రజరీ బెంచీల వైపు ఉంటే అపొజిషన్ లో ఉండే నేతగా కనిపిస్తారు. అయితే రాహుల్ గాంధీ గత ఇరవై నెలలుగా లీడర్ ఆఫ్ అపొజిషన్ గా ఎంతవరకూ ఎన్డీయేని ఇరుకున పెట్టారు తాను ఎంతవరకు ఇరుకున పడ్డారు అంటే రెండూనూ అని చెప్పాల్సి ఉంటుంది.

బీజేపీ టార్గెట్ గా :

రాహుల్ గాంధీ బీజేపీని టార్గెట్ గా చేసుకుని మాట్లాడుతున్నారు అన్న భావన ఉంది. అపోజిషన్ లీడర్ అదే చేయాల్సి ఉంది. కానీ అది పూర్తిగా బాహాటంగా కనిపించకూడదు అదే లౌక్యమని అంటారు. మోడీ ప్రభుత్వం మీద అక్కసుతో ఆరోపణలు చేస్తున్నారు అన్నట్లుగా కాకుండా రాహుల్ చాకచక్యంగా వ్యవహరించడంలో ఇబ్బంది పడుతున్నారా అన్నది చర్చకు వస్తోంది. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబట్టి తాను ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటున్నారని అందుకే విమర్శల పాలు అవుతున్నారని ఎన్డీయే వైపు నుంచి వస్తున్న మాట. అదే సమయంలో రాహుల్ గాంధీని కట్టడి చేయడానికి ఏకంగా ఎన్డీయేలో టాప్ లీడర్లు అంతా కలసి ముందుకు రావడం చూస్తూంటే ఆయన అధికార పార్టీని సైతం బాగానే ఇబ్బంది పెడుతున్నారు అని అర్ధం అవుతోంది.

గొంతు నొక్కుతున్నారు అంటూ :

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ గత సెషన్లలో ఓటు చోరీ అంటూ విమర్శలు సంధించారు. ఈసారి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ఆయన చైనా భారత్ భూభాగం ఆక్రమణ అంటూ ఏకంగా ఎన్డీయే సర్కార్ ని ఉలిక్కి పడేలా చేశారు. అయితే ఈ ఇష్యూని ఆయన సరైన సందర్భంలో ప్రస్తావిస్తే బాగానే పేలేదని అంటున్న వారూ ఉన్నారు. కానీ రాహుల్ చెప్పేది ఏంటి అంటే రాష్ట్రపతి ప్రసంగంలో జాతీయ భద్రత అన్నది ఉంది కాబట్టి తాను ప్రస్తావించాను పైగా ఆధారసహితంగా తాను మాట్లాడుతున్నారు అని అంటున్నారు. స్పీకర్ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కూడా రాహుల్ ఆరోపిస్తూ తాజాగా స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

ప్రజా సమస్యల మీద :

రాహుల్ గాంధీ ఏ ఇష్యూని ఎంచుకున్నా అభ్యంతరం అయితే లేదు, అదే సమయంలో సందర్భం చూసి గట్టిగా ఫోకస్ చేస్తే వచ్చే ఇంపాక్ట్ వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో బడ్జెట్ లో అనేక కీలక అంశాలు ఉన్నాయని ప్రజా సమస్యల గురించి ఆయన మాట్లాడితే మొత్తం 140 కోట్ల ప్రజల అభిమానం చూరగొంటారని అంటున్నారు. ఇక అధికార ఎన్డీయే మాత్రం రాహుల్ గాంధీ విషయంలో ఎంత లైట్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా ఆయన గట్టిగానే ఉంటున్నారు అన్న మాట కూడా ఉంది. చూడాలి మరి ముందు ముందు ఏ విధంగా లీడర్ ఆఫ్ అపొజిషన్ తన వాడిని వేడిని చూపిస్తారో.