Begin typing your search above and press return to search.

రాహుల్ గ్రీన్ సిగ్న‌ల్‌.. తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పులు!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మార్పుల‌కు ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   27 May 2025 4:12 AM
రాహుల్ గ్రీన్ సిగ్న‌ల్‌.. తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పులు!
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మార్పుల‌కు ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. తెలంగాణ పీసీసీలో ఉన్న ప‌ద‌వుల భ‌ర్తీతో పాటు.. మంత్రివ‌ర్గ కూర్పుపైనా పార్టీ అగ్ర‌నేత నుంచి దాదాపు అనుమ‌తి వ‌చ్చిన‌ట్టు తెలంగాణ పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ వెల్ల‌డించారు. తాజాగా ఆయ‌న ఢిల్లీలో పార్టీ అగ్ర‌నాయ‌కుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. స‌తీమ‌ణితో క‌లిసి మ‌రీ వెళ్లిన ఆయ‌న‌.. సుమారు 40 నిమిషాల‌కు పైగానే.. రాహుల్‌తో చ‌ర్చించారు.

1) టీపీసీసీలో ఖాళీగా ఉన్న ప‌ద‌వులు.. జిల్లాస్థాయిలో నాయ‌కుల ఎంపిక‌, నియామ‌కం ఇప్పుడు చాలా కీల‌కంగాఉంది. దీనిపైనే మ‌హేష్‌కుమార్ గౌడ్ ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. వ‌చ్చే నెల‌లోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు రేవంత్ రెడ్డి ముహూర్తం ఖ‌రారు చేస్తున్న‌ట్టు.. వార్త‌లు వ‌స్తున్న ద‌రిమిలా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల ఎంపిక కీల‌కంగా మారింది. నాయ‌కులు లేకుండా.. పార్టీని ముందుకు న‌డ‌ప‌డం అనేది సాధ్యం కాదు. ఈ క్ర‌మంలో డీసీసీ స‌హా.. పీసీసీలోనూనాయ‌కుల‌ను నియ‌మించేందుకు రాహుల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

2) మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌. ప్ర‌స్తుతం ఉన్న రేవంత్ రెడ్డి మంత్రివ‌ర్గంలో మ‌రో ఆరుగురు నాయ‌కుల వ‌ర‌కు మంత్రులుగా తీసుకునే అవ‌కాశం ఉంది. అయితే.. ప్ర‌స్తుతం న‌లుగురు వ‌ర‌కు భ‌ర్తీ చేయొచ్చ‌ని తాజాగా మ‌హేష్ కుమార్ గౌడ్ న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. ఏ విష‌యం తేల్చి చెప్ప‌క‌పోయినా.. రెండు మూడు రోజుల్లోనే అన్నీ జ‌రుగుతాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. సో.. దీనిని బ‌ట్టి మంత్రివ‌ర్గంలోనూ మార్పులు జ‌రుగుతాయ‌ని పార్టీలో జోష్ పెరిగింది. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కి సీటు ఖ‌రారైన‌ట్టు స‌మాచారం.