Begin typing your search above and press return to search.

రాహిల్‌ కేసులో ట్విస్టులు... ఒకర్ని తప్పించబోయే 15మంది బలి!!

బోధన్ బీఆరెస్స్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కారు డిసెంబరు 23న అర్ధరాత్రి ప్రజాభవన్‌ దగ్గరున్న ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీకొట్టిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   9 April 2024 4:13 AM GMT
రాహిల్‌ కేసులో ట్విస్టులు... ఒకర్ని తప్పించబోయే 15మంది బలి!!
X

బోధన్ బీఆరెస్స్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కారు డిసెంబరు 23న అర్ధరాత్రి ప్రజాభవన్‌ దగ్గరున్న ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీకొట్టిన సంగతి తెలిసిందే! ఈ కేసులో తవ్వేకొద్దీ కొత్త కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా... నిందితుడిని తప్పించబోయే ఇద్దరు ఇన్‌ స్పెక్టర్లు సహా 15 మంది మెడకు ఈ వ్యవహారం చుట్టుకుని అంతా కటకటాలకు వెళ్లాల్సి వచ్చిందని అంటున్నారు!

అవును... గత ఏడాది డిసెంబరు 23న అర్ధరాత్రి ప్రజాభవన్‌ దగ్గరున్న ట్రాఫిక్‌ బారికేడ్లను కారు ఢీకొట్టడం.. అప్పుడు విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు కారు నడుపుతున్నది రాహిల్‌ అని గుర్తించడం.. అనంతరం రాహిల్‌ సహా కారులోని మరో ముగ్గురు యువతుల్ని పంజాగుట్ట పీఎస్ లో అప్పగించడం తెలిపిందే!! ఇందులో భాగంగా... కానిస్టేబుల్‌ ఫిర్యాదు ప్రకారం పోలీసులు.. కేసు రిజిస్టర్‌ చేశారు.

వాస్తవానికి ఇది కేసు! అంటే... కారు నిర్లక్ష్యంగా నడిపినందుకు రాహిల్‌ ఒక్కరితో ఆగిపోవాల్సిన కేసు!! కానీ... తన తండ్రి పలుకుబడితో కేసు నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి, ఎన్నో మలుపులు తిరిగి మరో 15 మంది మెడకు చుట్టుకుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా.. ఒక మాజీ ఎమ్మెల్యే, ఇద్దరు సీఐలతో పాటు మరో 12 మందిపై కేసులు నమోదయ్యాయని అంటున్నారు!

డిసెంబరు 23 అర్ధరాత్రి పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తర్వాత.. రాహిల్ తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే షకీల్ కు ఫోన్ చేసి సమాచారం అందించాడట. దీంతో ఆయన తన సమీప బంధువులతో పాటు.. బోధన్ ఇనిస్పెక్టర్ ప్రేం కుమార్, పంజాగుట్ట ఇనిస్పెక్టర్ దుర్గారావు మంత్రాంగం నడిపించి.. రాహిల్ ను ఈ వ్యవహారం నుంచి తప్పించారని అంటున్నారు! ఇందులో భాగంగా తెల్లరేసరికి అతడి స్థానంలో మరొకరిని ఉంచారంట!

అయితే... ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఉన్నతాధికారుల వరకూ చేరిందని అంటున్నారు. దీంతో... ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు... లోతైన దర్యాప్తు చేశారని తెలుస్తుంది. దీంతో... మాజీ ఎమ్మెల్యే షకీల్ తో పాటు, ఇద్దరు సీఐలు, మరో 12 మంది పాత్ర నిర్ధారణ అయ్యింద్ని తెలుస్తుంది. దీంతో ఆ 15 మంది కటకటాలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి!!