Begin typing your search above and press return to search.

హనీమూన్ హత్య.. అలా కండిషన్ పెట్టి

ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో తాజాగా ఓ కీలక విషయం బయటపడింది. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన రఘువంశీ, సోనమ్ జంటకు తొలి రాత్రి కూడా జరగలేదట.

By:  Tupaki Desk   |   13 Jun 2025 8:15 AM IST
హనీమూన్ హత్య.. అలా కండిషన్ పెట్టి
X

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రఘువంశీ అనే కొత్త పెళ్లికొడుకు మేఘాలయాలో హనీమూన్ కోసం వెళ్లి హత్యకు గురైన ఉదంతం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ముందు దీన్ని మామూలు హత్యగానే భావించారు కానీ.. తర్వాత స్వయంగా భార్యే తన ప్రియుడిని, సుపారీ కిల్లర్లను పెట్టి భర్తను హత్య చేయించిందని వెల్లడి కావడంతో ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ హత్యతో తనకే సంబంధం లేదని.. హత్య చేసిన వాళ్లు తనను కూడా కిడ్నాప్ చేశారని సోనమ్ అమాయకురాలిలా మాట్లాడింది కానీ.. సాక్ష్యాలు పూర్తిగా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయి. స్వయంగా సోనమ్ సోదరుడే తన చెల్లే భర్తను చంపించిందని.. ఆమెను ఉరి తీయాలని పేర్కొనడంతో జనాలకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో తాజాగా ఓ కీలక విషయం బయటపడింది. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన రఘువంశీ, సోనమ్ జంటకు తొలి రాత్రి కూడా జరగలేదట. రాజ్ కుశ్వాహాదీ అనే వ్యక్తితో ముందే సంబంధం పెట్టుకుని, అయిష్టంగా పెళ్లి చేసుకున్న సోనమ్.. తన భర్త రఘువంశీని కనీసం తనను తాకనివ్వలేదట. మేఘాలయలోని కామాఖ్య అనే ఆలయంలో తనకు మొక్కు ఉందని.. అక్కడ పూజలు చేశాకే తనను తాకనిస్తానని భర్తకు షరతు పెట్టిందట సోనమ్. ఆమె చెప్పిన ప్రకారమే నాంగ్రియాట్ అనే ప్రాంతంలో దట్టమైన అడవుల మధ్య ఉన్న కామాఖ్య ఆలయానికి తనను తీసుకెళ్లమని భర్తకు చెప్పిందట.

ఆలయానికి వెళ్లే మార్గంలోని అడవుల్లో భర్తను చంపడానికి బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కుట్ర పన్నిందట. ముందు నాంగ్రియాట్ ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ పర్యాటకులు ఎక్కువగా ఉండడంతో.. అక్కడి నుంచి వెయిసావ్రింగ్ జలపాతం దగ్గరికి తీసుకెళ్లిందట సోనమ్. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు బాయ్‌ఫ్రెండ్‌కు, సుపారీ గ్యాంగ్‌కు తన లొకేషన్ షేర్ చేస్తూ వచ్చింది. ఆ జలపాతం దగ్గర జనం లేని ప్రదేశానికి తీసుకెళ్లి రఘువంశీని సుపారీ కిల్లర్లకు అప్పగించింది. వాళ్లు అతణ్ని హత్య చేస్తుంటే అక్కడే ఉండి చూస్తూ ఉందట సోనమ్. ఈ కేసులో సోనమ్, రాజ్‌లతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించిన పోలీసులు.. వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు.