Begin typing your search above and press return to search.

రఘురామ ఖాతాలో మరో క్రెడిట్... అయినా నో టిక్కెట్!

కూటమిలో భాగంగా నరసాపురం ఏ పార్టీకి దక్కినా పోటీ చేసేది మాత్రం తానే అన్నస్థాయిలో పూర్తి నమ్మకంతో ఇంతకాలం చెప్పిన రఘురామకు టిక్కెట్ లేదని ఈ మధ్యే తెలిసిన సంగతి తెలిసిందే!

By:  Tupaki Desk   |   30 March 2024 10:38 AM GMT
రఘురామ ఖాతాలో మరో క్రెడిట్... అయినా నో టిక్కెట్!
X

ఏపీ రాజకీయాల్లో మరోసారి.. నరసాపురం లోక్ సభ నియోజకవర్గం, అక్కడ సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం వార్తల్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కూటమిలో భాగంగా నరసాపురం ఏ పార్టీకి దక్కినా పోటీ చేసేది మాత్రం తానే అన్నస్థాయిలో పూర్తి నమ్మకంతో ఇంతకాలం చెప్పిన రఘురామకు టిక్కెట్ లేదని ఈ మధ్యే తెలిసిన సంగతి తెలిసిందే! అయితే.. మరో రెండు మూడు రోజుల్లో తనకు టిక్కెట్ కన్ ఫాం అవుతుందనే నమ్మకం తనకుందని ఆయన చెబుతున్నారు.

అయితే... పొత్తులో భాగంగా నరసాపురం టిక్కెట్ బీజేపీ ఖాతాలో పడటం, అక్కడ నుంచి శ్రీనివాస వర్మ కు టిక్కెట్ దక్కడ తెలిసిందే. దీంతో... ఆయన ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారని అంటున్నారు. మరో పక్క రఘురామ మాత్రం నమ్మకంగా చెబుతున్నారు. దీంతో... దేశంలోనే మూడో రిచ్చెస్ట్ ఎంపీకి కూటమిలోని మూడు పార్టీల్లో ఒక్కరైనా టిక్కెట్ ఇవ్వకపోవడం ఏమిటబ్బా అని ఆయన ఫ్యాన్స్ ఫీలవుతున్నారంట.

అవును... టిక్కెట్ సంగతి కాసెపు పక్కనపెడితే... తాజాగా రఘురామ కృష్ణంరాజుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. దేశంలో ఉన్న 514 మంది ఎంపీల్లోనూ ఈయన మూడో అత్యధిక ధనవంతుడు అని తెలిసింది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ద్వారా తెలిసిన వివరాల ప్రకారం... దేశంలోని మొత్తం 514 మందిలో 25 మందికి పైగా లోక్ సభ ఎంపీలు తమ ఆస్తుల విలువ రూ. 100 కోట్లకు పైనే ఉన్నట్లు ప్రకటించారు!

ఈ సమయంలో ఏడీఆర్ నివేధిక ప్రకారం... ఆ 25 మంది బిలియనీర్లలో తొమ్మిది మంది బీజేపీకి చెందినవారే ఉన్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో 46 మంది ఉన్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీల్లో ఇద్దరు మాత్రమే బిలియనీర్లుగా ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో రిచ్చెస్ట్ ఎంపీల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన చింద్వార్ (మధ్యప్రదేశ్) ఎంపీ నకుల్ నాథ్ 660 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్న ఎంపీ కాగా.. బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేష్ 338 కోట్లతో రెండో అత్యంత సంపన్న ఎంపీగా నిలిచారు.

ఈ క్రమంలో 2019లో నరసాపురం నుంచి వైసీపీ టిక్కెట్ పై గెలిచిన రఘురామ కృష్ణంరాజు 325 కోట్ల ఆస్తులతో సిట్టింగుల్లో అత్యంత సంపన్న ఎంపీల్లో మూడో స్థానంలో నిలిచారు. ఇదే క్రమంలో వైసీపీకి చెందిన ఎంపీలలో ఇద్దరు బిలియనీర్లుగా ఉన్నారు! అదేవిధంగా... బీఆరెస్స్ కు చెందిన వారిలో ఇద్దరు ఎంపీలు బిలియనీర్లుగా ఉండగా... డీఎంకే ఎంపీలలో ఒకరు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు.

అదేవిధంగా... శివసేన, తెలుగుదేశం, బిజూ జనతాదళ్, బీఎస్పీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరత్ చంద్ర పవార్) నుంచి ఒక్కొక్క ఎంపీ బిలియనీర్ గా ఉన్నారు.