డిప్యూటీ స్పీకర్‌పై రుసరుస.. ఏం జరుగుతోంది..?
ఈ క్రమంలో అప్పటి వరకు వైసీపీపై పోరాడి.. కూటమికి అనుకూలంగా వాయిస్ వినిపించారన్న పేరు ఉండడంతో ఆయనకు పిలిచి మరీ చంద్రబాబు అవకాశం ఇచ్చారు.
By: Tupaki Desk | 30 April 2025 4:31 PMఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చుట్టూ వివాదాలు ముసురుకున్నాయా? ఆయనపై సొంత పార్టీ నాయకులు రుసరుసలాడుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల సమ యంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. రఘురామకృష్ణ రాజుకు ఉండి టికెట్ ఇచ్చారు. అప్పట్లో బీజేపీ నాయకులు తనకు ఎంపీ సీటు ఇస్తారని రఘురామ ఆశలు పెట్టుకున్నారు.అ యితే.. చివరి నిముషంలో మారిన పరిణామాల నేషథ్యంలో భూపతిరాజు శ్రీనివాసవర్మకు నరసాపురం ఎంపీటికెట్ దక్కింది.
ఈ క్రమంలో అప్పటి వరకు వైసీపీపై పోరాడి.. కూటమికి అనుకూలంగా వాయిస్ వినిపించారన్న పేరు ఉండడంతో ఆయనకు పిలిచి మరీ చంద్రబాబు అవకాశం ఇచ్చారు. వాస్తవానికి ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజుకు.. అప్పటికే టికెట్ ఖరారైంది. దీంతో ఆయన ప్రచారం కూడా ప్రారంభించా రు. కానీ, చంద్రబాబు ఆయనను కూడా వెనక్కి పిలిచి మరీ రఘురామకు అవకాశం ఇచ్చారు. ఈ విషయం లో టీడీపీ నేతల మధ్య కొంత అసంతృప్తి నెలకొంది.
దీంతో అప్పట్లో ఈ విషయాన్ని గ్రహించిన రఘురామ అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు మీటింగులు.. పెట్టి, పార్టీలు ఇచ్చి.. వారిని బుజ్జగించారు. సరే.. అప్పటికి ఆ సమస్య పరిష్కారం అయింది. అయితే.. రఘురామ డిప్యూటీ స్పీకర్ పదవిని చేపట్టిన తర్వాత.. పరిస్థితులు మారిపోయాయన్నది.. ప్రస్తుతం వినిపిస్తున్న టాక. తన నియోజకవర్గంలో టీడీపీలోని నాయకులను రెండు విభాగాలుగా విభజించి.. ఆయన ప్రోత్సహిస్తున్నారని.. పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
అయితే.. దీనిలో నిజం ఎంతో బయటకు రాలేదు. కానీ, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. అధికారిక కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే హోదా, ప్రస్తుతం నామినేటెడ్ పదవిలో కూడా ఉన్న మంతెన రామరాజు కు ఎలాంటి ఆహ్వానాలు అందడం లేదని ఆయన వర్గం ఆరోపిస్తోంది. పైగా.. అంతర్గతంగా కూడా.. రాజుకు వ్యతిరేకంగా రఘురామ వర్గంగా చెప్పుకొనే కొందరు చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. దీంతో తమకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని చెబుతున్నారు. దీంతో కొన్నాళ్లుగా ఉండిలో రాజకీయాలు వేడెక్కడం ప్రారంభించాయి. మరి ఏంజరుగుతుందో చూడాలి.