సొంత గ్రాఫ్ కోసం.. ఏపీలో 'రాజు'ల పొలిటికల్ విన్యాసాలు.. !
టీడీపీ, బీజేపీలో కీలక క్షత్రియ సామాజిక వర్గం నుంచి పలువురు నాయకులు విజయం దక్కించుకున్నారు.
By: Garuda Media | 6 Jan 2026 10:00 PM ISTటీడీపీ, బీజేపీలో కీలక క్షత్రియ సామాజిక వర్గం నుంచి పలువురు నాయకులు విజయం దక్కించుకున్నారు. వారి సొంత బలం కావొచ్చు.. కూటమి హవా కావొచ్చు. గత ఎన్నికల్లో విజయం సాదించారు. అయితే.. పార్టీల తరఫున.. ప్రభుత్వం తరఫున వారు గళం వినిపిస్తే మంచిదే. ఇలా చేయాలనే పార్టీలు కూడా చెబుతున్నాయి. కానీ, ఆదిశగా ఇద్దరు కీలక నాయకులు మాత్రం అడుగులు వేయలేకపోతున్నారు. సొంత గ్రాఫ్ కోసం.. విన్యాసాలు చేస్తున్నారనే వాదనను బలపరుస్తున్నారు.
రఘురామకృష్ణరాజు: ఉండి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఆయన.. ప్రజల కోసం పనిచేస్తే.. అందరూ హర్షిస్తారు. కానీ, ఏడాదిన్నర కాలంలో ప్రజలకు ఇచ్చిన సమయంలో పట్టుమని కొన్ని గంటలకే పరిమితం అయింది. ఇప్పటికీ.. ఆయన వ్యక్తిగత ఇమేజ్‌ను గ్రాఫ్‌ను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తనపై వస్తున్న వాదనలు.. విమర్శలకు సమాధానం ఇచ్చేందుకు నిరంతరం వీడియోలు చేసేందుకు పరిమితం అవుతున్నారు. దీనిని టీడీపీ నాయకులు హర్షించలేక పోతున్నారు.
విష్ణుకుమార్‌రాజు: బీజేపీ నాయకుడిగా అందరికీ సుపరిచితుడు అయిన ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. కానీ, ఈయనకు మంత్రి పదవిపై ఆలోచన ఉంది. అది నెరవేరడం లేదు. పోనీ.. రాష్ట్ర బీజేపీ పగ్గాలు అయినా.. దక్కుతాయని అనుకున్నారు అవి కూడా దక్కలేదు. దీంతో సొంత పార్టీలోనే ఎగస్పార్టీగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై తనదైన విమర్శలు చేస్తున్నారు. తద్వారా తన గ్రాఫ్‌ను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు.
దృష్టి పెట్టిన పార్టీలు: ఈ ఇద్దరు నాయకుల వ్యవహార శైలిపైనా అటు టీడీపీ, ఇటు బీజేపీలు దృష్టి పెట్టాయి.పైకి వారిద్దరినీ ఏమీ అనకపోయినా.. మంత్లీ రివ్యూల్లో మాత్రం ఇద్దరు రాజుల వ్యవహారాన్ని చర్చిస్తున్నాయి. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున వాయిస్ వినిపిస్తే.. అందరికీ మంచిదని నర్మగర్బంగా సీఎం చంద్రబాబు ఇద్దరు రాజులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయినా..వారిలో మార్పు మాత్రం రావడం లేదు. దీంతో ఇద్దరి వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
