Begin typing your search above and press return to search.

ర‌ఘురామ బిజీనా.. మౌన‌మా.. !

శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు మౌనంగా ఉన్నారు.

By:  Garuda Media   |   27 Sept 2026 12:00 AM IST
ర‌ఘురామ బిజీనా.. మౌన‌మా.. !
X

శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు మౌనంగా ఉన్నారు. త‌ర‌చుగా మీడియా ముందుకు వ‌చ్చి.. కామెంట్లు చేసే ఆయ‌న ఇటీవ‌ల కాలంలో ఫుల్లు సైలెంట్ అయిపోయారు. అలాగ‌ని.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న యాక్టివ్‌గా లేరా.. అంటే.. ఉన్నార‌నే చెబుతున్నారు. తన నియోజకవర్గ పనుల్లో, అధికారిక బాధ్యతల్లో చాలా బిజీగా ఉన్నార‌ని అనుచ‌రులు చెబుతున్నారు. .గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజూ ప్రెస్‌మీట్‌లు, ‘రచ్చబండ’ కార్యక్రమాలతో నిరంతరం వార్తల్లో నిలిచిన రఘురామ ఇప్పుడు ఆ మేర‌కు దూకుడు ప్ర‌ద‌ర్శించ‌క‌పోవ‌డం మాత్రం చ‌ర్చ‌కు దారితీస్తోంది.

అయితే.. దీనికి `డిప్యూటీ స్పీకర్ హోదా`లో ఉండటం వల్ల రాజకీయ విమర్శల జోరును కాస్త తగ్గించారని భావిస్తున్నారు. ఇక‌, క్షేత్రస్థాయిలో ఆయన చురుగ్గానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ శ్రేణులు అదేవిధంగా సొంత సామాజిక వ‌ర్గం మ‌ద్ద‌తుతో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ ద‌ఫా మాత్రం.. త‌ను సొంతంగా పోటీ చేసినా విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇటీవల వినాయక చవితి నిమజ్జన ఊరేగింపుల సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా డీజేల వినియోగానికి అనుమతులు ఉన్నప్పటికీ, తన నియోజకవర్గంలో శాంతిభద్రతల దృష్ట్యా డీజేల శబ్దాలపై కఠినంగా నిరాకరిస్తూ తీసుకున్న నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక‌, రామాల‌య నిర్మాణాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం దీనిపై పూర్తిస్థాయిలో ఆయ‌న దృష్టి పెట్టార‌ని అంటున్నారు. అయితే.. మ‌న‌సులో మాత్రం కొంత మేర‌కు అసంతృప్తి కొన‌సాగుతోంది.

గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలు, అలాగే ఆయనకు వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలు దాఖలు చేసిన కొన్ని వ్యక్తిగత వివాదాల కేసులు కోర్టుల్లో కొనసాగుతున్నాయి. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం త‌నకు త‌గిన విధంగా స్పందించ‌లేద‌న్న ఆవేద‌న ఆయ‌న‌లో క‌నిపిస్తోంది. ఇక‌, కూట‌మిలో క‌లివిడి విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న టీడీపీ కంటే కూడా.. బీజేపీ నాయ‌కుల‌తో రిలేష‌న్ ఎక్కువ‌గా మెయిటెన్ చేస్తున్నార‌ని అంటున్నారు. అయితే.. ఈ విష‌యంలో ఎలాంటి వివాదాలు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. మ‌ళ్లీ ఎంపీగా వెళ్లాల‌న్న ప్ర‌య‌త్నం ఒక‌వైపు కొన‌సాగిస్తూనే.. ఉండిలో త‌న‌దైన ఓటు బ్యాంకును పెంచుకునేలా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. రాజ‌కీయ వ్యూహాల విష‌యంలో మాత్రం దూకుడుగా నే ఉన్నార‌ని అంటున్నారు.