పంతం నెగ్గించుకున్న రఘురామ.. రామాలయానికి శంకుస్థాపన!
టీడీపీ నాయకుడు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. తన పంతం నెగ్గించుకున్నారు.
By: Garuda Media | 3 May 2026 5:26 PM ISTటీడీపీ నాయకుడు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. తన పంతం నెగ్గించుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం పరిధిలోని ఆకివీడులో ఉన్న పెదపేటలో ఇటీవల వివాదాస్పదమైన రామాలయ పునర్నిర్మాణ పనులకు ఆదివారం ఉదయం ఆయన సతీసమేతం గా శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.
రఘురామ దంపతులు.. పీటలపై కూర్చుని.. శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం విజయ నగరం జిల్లాకు చెందిన పండితులను తీసుకువచ్చి.. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. రాముల వారి ఆలయాన్ని నిర్మిం చి తీరుతామని చెప్పారు. పండితుల సూచనల మేరకు ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసి నట్టు తెలిపారు.
ఈ వ్యవహారంపై కొందరు ఇప్పటికే కోర్టుకు వెళ్లారని.. అయినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యా నించారు. వచ్చే 100 సంవత్సరాలు ఆలయం పటిష్టంగా ఉండేలా నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలి పారు. ఇప్పటికే శిలలను తీసుకువచ్చి.. దేవతా విగ్రహాలుగా మలిచే కార్యక్రమం కూడా మొదలైందన్నా రు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆలయ నిర్మాణం పూర్తవుతుందని జ్యోతిషులు, పండితులు తనకు చెప్పారని రఘురామ తెలిపారు.
ఏంటి వివాదం..
ఆకివీడులోని పెదపేటలో రాములవారి ఆలయం ఉందని కొందరు.. కాదు.. ఇక్కడ గొంతేనమ్మ రూపంలో గ్రామ దేవత ఉందని మరికొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన శ్రీరామనవమి సందర్భం గా రఘురామ అక్కడి రాముల వారి విగ్రహానికి పూల దండలు వేయాలని నిర్ణయించుకుని వెళ్లగా.. దీనిని కొందరు దళిత క్రైస్తవులు అడ్డుకున్నారు. ఇక్కడ నుంచి ప్రారంభమైన వివాదం.. తాజాగా రామాలయం నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగే వరకువెళ్లింది. అయితే.. ఈ వ్యవహారంపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి.
