Begin typing your search above and press return to search.

రఘురామ డ్రామా చేశారు...పీవీ సునీల్ సంచలన కామెంట్స్ !

ఏపీలో ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు ఒకపుడు వైసీపీ రెబెల్ ఎంపీగా ఉండేవారు. ఆ సమయంలో ఆయనను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరుకి తరలించారు.

By:  Satya P   |   3 May 2026 8:00 AM IST
రఘురామ డ్రామా చేశారు...పీవీ సునీల్ సంచలన కామెంట్స్ !
X

ఏపీలో ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు ఒకపుడు వైసీపీ రెబెల్ ఎంపీగా ఉండేవారు. ఆ సమయంలో ఆయనను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరుకి తరలించారు. ఇదంతా ఒక సంచలనంగా అప్పట్లో మారింది. అయితే ఆనాడు ఏపీ సీఐడీ చీఫ్ గా ఉన్న పీవీ సునీల్ కుమార్ రఘురామ అరెస్ట్ విషయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఆ సమయంలో తన మీద పోలీసులు టార్గెట్ చేసి మరీ ఇంటరాగేషన్ పేరుతో హింసించారని రఘురామ అప్పట్లో మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేశారు. తీవ్ర ఆరోపణలు కూడా సునీల్ కుమార్ మీద చేశారు. వాటికి తెలుగు చానల్ లో క్రాస్ ఫైర్ కార్యక్రమంలో పీవీ సునీల్ కుమార్ పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అరెస్ట్ కి సహకరించలేదు :

రఘురామ ఆ సమయంలో అరెస్ట్ కి సహకరించలేదని సునీల్ కుమార్ అన్నారు. ఆయన దగ్గర ఉన్న సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ని ఉసిగొలిపారని అన్నారు. దాంతో ఆయన అరెస్టు సందర్భంగా పెద్ద ఎత్తున డ్రామా నడచింది అని అన్నారు. అరెస్ట్ కి సహకరించకపోతే ఫోర్స్ గా అయినా తీసుకుని వస్తారని అదే జరిగింది అన్నారు. ఆ సమయంలో రఘురామ తన కాళ్ళను గుమ్మానికి తన్నారు అని సునీల్ కొత్త విషయం చెప్పారు. అదంతా టీవీలలో లైవ్ లో ప్రసారం కూడా అయింది అని అన్నారు. ఆయన అంతలా ప్రతిఘటించిన తరువాత పోలీసులు కూడా అరెస్టు చేయాలి కాబట్టే చేశారు అని సునీల్ కుమార్ చెప్పారు.

రఘురామను రెచ్చగొట్టలేదు :

ఇక తాను రఘురామను ఎపుడూ రెచ్చగొట్టింది లేదని సునీల్ కుమార్ స్పష్టం చేశారు. గడచిన మూడేళ్ళుగా ఆయన తన మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు అని అన్నారు. అందుకే తాను ఈ మధ్య వాటిని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను అన్నారు. తాను ఎపుడూ సోషల్ మీడియాలో మొదటి పోస్టు పెట్టడం కానీ అలాగే మొదటిసారి ఒకరి మీద ఆరోపణలు చేస్తూ మాట్లాడడం కానీ చేసే వ్యక్తిని కాను అన్నారు. తమ వారికి కూడా ఇదే విషయం చెబుతూ ఉంటాను అన్నారు. అయితే అవతల వైపు నుంచి అదే పనిగా విమర్శలు వస్తూ ఉంటే వాటినే జనాలు నమ్మడానికి ఆస్కారం ఉందని ఆయన అన్నారు. అందుకే తన వైపు నుంచి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నాను అని అన్నారు.

ఆమెను అరెస్ట్ చేయలేదు :

వైసీపీ ప్రభుత్వ పాలనలో సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు రంగనాయకమ్మను అనే ఆమెను అరెస్టు చేశారు అన్న వార్తలు అవాస్తవం అన్నారు. ఆనాడు ఆమెకు నోటీసు ఇచ్చి పిలిపించి విచారించామని అంతే జరిగింది అని అన్నారు. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వెనక్ ఆధారాలు ఏమిటి అని అడగడానికే పిలిపించామని తప్పించి అరెస్ట్ అన్నదే లేదని అన్నారు. కానీ దాని మీద అరెస్టు చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు రాశారని ఆయన అన్నారు.