Begin typing your search above and press return to search.

రొటీన్ కి భిన్నం... యువకుడి మీద యువతి యాసిడ్ దాడి!

అవును... సాధారణంగా తమను ప్రేమించట్లేదన్న కోపంతో అమ్మాయిలపై ఆరాచకంగా వ్యవహరిస్తున్న సంఘటనలకు సంబంధించిన కథనాలు ఇప్పటికే చాలా వచ్చాయి.

By:  Tupaki Desk   |   4 Oct 2023 6:53 AM GMT
రొటీన్ కి భిన్నం... యువకుడి మీద యువతి యాసిడ్ దాడి!
X

ప్రేమించలేదనో.. పెళ్లికి అంగీకరించలేదనో అమ్మాయిలపై యాసిడ్ దాడి వంటి కౄరమైన పనులను పాల్పడే వ్యక్తులకు సంబందించిన అనేక ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రొటీన్ కి భిన్నంగా యువకుడిపై ఒక యువతి యాసిడ్ దాడికి పాల్పడిన సంఘటన తాజా వెలుగులోకి వచ్చింది.

అవును... సాధారణంగా తమను ప్రేమించట్లేదన్న కోపంతో అమ్మాయిలపై ఆరాచకంగా వ్యవహరిస్తున్న సంఘటనలకు సంబంధించిన కథనాలు ఇప్పటికే చాలా వచ్చాయి. ఈ నేపథ్యంలో అందుకు భిన్నమైన ఉదంతం ఒకటి గుంటూరులో చోటుచేసుకుంది. అందులో భాగంగా.. తనతో సహజీవనంలో ఉన్న యువకుడి మీద ఒక యువతి యాసిడ్ దాడికి పాల్పడింది.

వివరాళ్లోకి వెళ్తే... గుంటూరు పట్టణంలో నల్లపాడుకు చెందిన వెంకటేష్ అనే యువకుడు ఒక వాటర్ ప్లాంట్ లో పని చేస్తున్నాడు. స్థానికంగా వివిధ ప్రాంతాలకు వాటర్ డబ్బాలను సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో రామిరెడ్డి తోటకు చెందిన రాధ అనే వివాహితతో వెంకటేశ్ కు పరిచయం ఏర్పడింది.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరాకు చెందిన రాధకు భర్త లేడు. స్థానికంగా ఉంటూ ఇళ్లల్లో పని చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వెంకటేష్ పరిచయం కాస్తా ప్రణయంగా మారినట్లుంది. ఈ క్రమంలో అది కాస్తా సహజీవనంగా రూపుదిద్దుకోంది. అవును... వీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది.

అయితే కాలక్రమేణా... వీరిద్దరి వ్యవహారం వెంకటేష్ తల్లిదండ్రులకు తెలిసిపోయింది. దీంతో... రాధను ఇంటి నుంచి బయటకు పంపేశారు. ఈ క్రమంలో వెంకటేష్.. అతని కుటుంబ సభ్యులు తనను కొట్టారని, గాయపరిచారని స్థానిక పోలీస్ స్టెషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో.. వెంకటేష్ తో పాటు అతడి తల్లితడ్రులపై నా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో తనను ఇంట్లో నుంచి గెంటేసిన విషయంపై రాధ బాగా కక్ష పెంచేసుకుంది. ఇంతకాలం తాను వాడుకుని ఇవాళ లైట్ తీసుకున్నాడని ఫిక్సయినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో ముగ్గురు కుర్రాళ్లను తీసుకొని ఆటోలో వెంకటేష్ వద్దకు వెళ్లిన రాధ కీలక నిర్ణయం తీసుకుంది.

అవును.. ముగ్గురు కుర్రాళ్లను తీసుకుని బయలుదేరిన రాధ... అక్కడ వాటర్ బాటిళ్లను కిందకు దించుతున్న వెంకటేష్ ని చూసి కారాలూ మిరియాలూ నూరింది. వెంతనే వెనుక నుంచి యాసిడ్ పోసింది. దీంతో... ఒంటిమీద యాసిడ్ పడగానే పుట్టిన మంటలకు పెద్దగా కేకలు వేయటం ప్రారంభించాడు వెంకటేష్.

దీంతో.. విషయం గ్రహించిన స్థానికులు స్పందించి అతన్ని ఆసుపత్రికి తరలించారు. మరోపక్క యాసిడ్ దాడి అనంతరం తాను వచ్చిన ఆటోలోనే రాధ పరారైందని తెలుస్తుంది. ఇదే విషయన్ని వెంకటేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ షాకింగ్ ఉదంతంపై స్పందించిన పోలీసులు రాధతో పాటు.. ఆమెకు సహకరించిన మరో ముగ్గురి పైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం రాధ, ఆమెతో పాటు ఉన్న ముగ్గురు యువకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.