Begin typing your search above and press return to search.

8 మంది నేవీ అధికారుల మరణశిక్ష కేసులో.. స్వల్ప ఊరటిచ్చిన ఖతర్ కోర్టు!

గూఢచర్యం ఆరోపణలపై గత కొన్ని నెలలుగా ఖతార్‌ నిర్బంధంలో ఉన్న భారత్‌ కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు అక్కడి కోర్టు ఇటీవల మరణశిక్ష సంగతి విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Nov 2023 7:13 AM GMT
8 మంది నేవీ అధికారుల మరణశిక్ష  కేసులో.. స్వల్ప ఊరటిచ్చిన ఖతర్  కోర్టు!
X

గూఢచర్యం ఆరోపణలపై గత కొన్ని నెలలుగా ఖతార్‌ నిర్బంధంలో ఉన్న భారత్‌ కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు అక్కడి కోర్టు ఇటీవల మరణశిక్ష సంగతి విషయం తెలిసిందే. ఈ విషయం సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

అవును... గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై గత కొన్ని నెలలుగా ఖతార్‌ నిర్బంధంలో ఉన్న భారత్‌ కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు అక్కడి కోర్టు ఇటీవల మరణశిక్ష విధించిన తీర్పును సవాలు చేస్తూ భారత ప్రభుత్వం చేసిన అప్పీల్‌ ను విచారించేందుకు ఖతార్ కోర్టు తాజాగా అంగీకరించింది. ఇందులో భాగంగా అప్పీల్‌ ను పరిశీలిస్తున్నామని, త్వరలో దీనిపై విచారణ ఉంటుందని న్యాయస్థానం తెలిపింది.

దీంతో... నిర్బంధంలో ఉన్న మాజీ నావికాధికారుల కుటుంబాలకు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఇందులో భాగంగా... భారత అప్పీల్‌ ను కోర్టు అంగీకరించిందని.. ఈ కేసులో తుది నిర్ణయంపై పరిశీలిస్తున్నట్లు పేర్కొందని.. అయితే విచారణ తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో... దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

కాగా... గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న అభియోగాలపై ప్రైవేటు భద్రతా సంస్థ అల్‌ దహ్రాలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులను 2022 ఆగస్టులో అక్కడి నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరంతా ఇజ్రాయెల్‌ కు గూఢచర్యం చేస్తున్నారంటూ వారిపై అభియోగాలు నమోదైనట్లు అక్కడి అధికారిక పత్రిక వెల్లడించింది. ఈ క్రమంలోనే 8 మంది భారతీయులకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది.

దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఈ తీర్పూపై భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అనంతరం.. ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం ఖతార్‌ లో ఈ తీర్పుపై అప్పీల్‌ దాఖలు చేసింది.

వాస్తవానికి మన నౌకాదళ మాజీ అధికారులను రక్షించుకోవడానికి పరిమిత మార్గాలున్నాయి. వీటిల్లో ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌ చేసుకోవడం ఒకటి కాగా.. అంతర్జాతీయ న్యాయస్థానంలో పోరాడటం మరొకటి. ఇక మూడోది దౌత్య మార్గం. ప్రస్తుతం భారత్ తో ఖతర్ కు ఉన్న సంబంధాల నేపథ్యంలో ఇదే ఉత్తమమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కారణం... ఖతర్ లో మరణశిక్షలు ఏ స్థాయిలో ఉంటాయో.. క్షమాబిక్షలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెబుతుంటారు. ఇందులో భాగంగా... రంజాన్‌, ఖతార్‌ నేషనల్‌ డే (డిసెంబర్‌ 18) వంటి ప్రత్యేకమైన రోజుల్లోవివిధ కేసుల్లో నిందితులకు ఆ దేశ పాలకుడు శిక్ష తగ్గించడం, క్షమాభిక్ష ప్రసాధించడం వంటివి చేస్తుంటారు. వీటిలో ఇది బెటర్ ఆప్షన్ అని అంటున్నారు నిపుణులు!

మరణ శిక్ష పడిన మాజీ అధికారుల్లో.. కెప్టెన్‌ నవతేజ్‌ సింగ్‌ గిల్‌, కెప్టెన్‌ సౌరభ్‌, కెప్టెన్‌ బీరేంద్ర కుమార్‌ వర్మ, కమాండర్‌ అమిత్‌ నాగ్‌ పాల్‌, కమాండర్‌ సుగుణాకర్‌ పాకాల, కమాండర్‌ తివారీ, కమాండర్‌ సంజీవ్‌ గుప్తా, సెయిలర్‌ రాగేగ్‌ లు ఉన్నారని అంటున్నారు!