Begin typing your search above and press return to search.

బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే... ఆసక్తికరంగా పీవీపీ ట్వీట్!

విజయవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అనూహ్యపరిణామాల మధ్య విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ భేటీ అయ్యారు.

By:  Tupaki Desk   |   11 Jan 2024 5:43 AM GMT
బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే... ఆసక్తికరంగా  పీవీపీ ట్వీట్!
X

విజయవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అనూహ్యపరిణామాల మధ్య విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ భేటీ అయ్యారు. అనంతరం మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు, లోకేష్ లతోపాటు పలువురు టీడీపీ నేతలపైనా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. అనంతరం టీడీపీ నేతల నుంచీ విమర్శలు ఎదురయ్యాయి. ఈ సమయంలో పీవీపీ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అయితే ఇది కేశినేని నానీని ఉద్దేశించేనా అనే చర్చ మొదలైంది.

అవును... విజయవాడ టీడీపీలో కీలక నేత, రెండు సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నాని... వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. త్వరలో వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. జగన్ ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత తీసుకుంటానని చెప్పారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో పీవీపీ ఆన్ లైన్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా ఒక ట్వీట్ చేశారు.

"బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే.. వీడి *%#$ బుద్ధి గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్!!" అని పీవీపీ ట్విట్టర్ లో స్పందించారు. దీంతో... ఈ ట్వీట్ కేశినేని నానిని ఇద్దేశించి పెట్టారంటూ కామెంట్లు వస్తున్నాయి. దానికీ ఒక బలమైన కారణం ఉంది. గతంలో కూడా నానీపై పీవీపీ తీవ్రస్థాయిలో ట్వీట్లు పెట్టేవారు. నానీని ట్యాగ్ చేసి మరీ దుయ్యబట్టేవారు.

ఇందులో భాగంగా కేశినేని నానీని ట్యాగ్ చేస్తూ... "పీపాల బస్తా, బెజవాడకే గుదిబండలా తయారయ్యావ్ నువ్వు.. ఏదో మచ్చ ఏసుకుని పుట్టావు, పార్టీ పుణ్యమా అని పదేళ్లు బండి కొనసాగించావు, బ్యాంకులను బాదావు, జనాలని, ఉద్యోగులని పీల్చి పిప్పి చేసావు.. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి, అన్ని మూసుకుని మూలపడుండు పుండాకొర్!!" అని ట్వీట్ చేశారు పీవీపీ! దీంతో అదేస్థాయిలో కౌంటర్లు కేశినేని ఫాలోవర్స్ నుంచి వచ్చి పడ్డాయి!

కాగా... 2019 ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ స్థానానికి వైసీపీ నుంచి పోటీ చేసిన కేవీపీ... 8,726 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కేశినేని నానీ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో కేశినేనికి 5,75,498 ఓట్లు వస్తే... పీవీపీకి 5,66,772 ఓట్లు పడ్డాయి! నాటి నుంచి సందర్భం వచ్చిన ప్రతీసారీ నానీని నెట్టింట తగులుకుంటూనే ఉంటుంటారు పీవీపీ!