'పుట్టా' రాజకీయం.. హిట్టా.. ఫట్టా .. !
ఏ సర్వేలోనూ ఆయన గ్రీన్ జోన్ లో కనిపించలేదు. అంటే ప్రజల్లో ఆయన పట్ల పెద్దగా సానుకూలత అయితే కనిపించడం లేదని స్పష్టం అవుతుంది.
By: Tupaki Desk | 27 Jun 2025 9:45 AM ISTపుట్టా సుధాకర్ యాదవ్... సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకునేందు కు ప్రయత్నాలు చేస్తున్నా.. ఎక్కడో బెడిసి కొడుతోంది. యనమల రామకృష్ణుడికి వియ్యంకుడిగా గుర్తింపు పొందిన ఆయన.. ఉమ్మడి కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ప్రయత్నం చేసి గత ఎన్నికల్లో ఒకసారి విజయం దక్కించుకున్నారు. 2014-19 ఎన్నికల్లో కూడా పుట్ట సుధాకర్ యాదవ్ పోటీ చేసినా.. ఆయన పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో మాత్రం తొలిసారి విజయం దక్కించుకున్నారు.
అయితే ఈ ప్రభావం ఎలా ఉంది? తొలిసారి విజయం దక్కించుకున్న ఆయన ప్రజలకు చేరువయ్యారా? అనే విషయాన్ని పరిశీలిస్తే.. ప్రస్తుతం నిర్వహించిన రెండు మూడు సర్వేలు ఒక దాంట్లో రెడ్ జోన్లో ఉండగా మరో దాంట్లో ఆరెంజ్ జోన్ లో ఉన్నారు. ఏ సర్వేలోనూ ఆయన గ్రీన్ జోన్ లో కనిపించలేదు. అంటే ప్రజల్లో ఆయన పట్ల పెద్దగా సానుకూలత అయితే కనిపించడం లేదని స్పష్టం అవుతుంది. రాజకీయంగా ఆయనకు మద్దతు ఉండొచ్చు.. పార్టీ పరంగా ఆయనకు మంచి సానుకూల వాతావరణ ఉంది.
కానీ ప్రజల మధ్య లేకపోయినా ప్రజలు పట్టించుకోకపోయినా మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి. అయితే ప్రస్తుతం జరిగింది ఒక ఏడాది కాబట్టి.. ప్రజల అంచనాలను చేరుకోలేక పోయినప్పటికీ వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో ఆయన ప్రయత్నించి ప్రజలను చేరుకునే ప్రయత్నం చేస్తే ఫలితం బాగానే ఉంటుందని సర్వే నిపుణులు చెబుతున్నారు. మైదుకూరు నియోజకవ ర్గంలో ఘనమైన రాజకీయాలు ఉంటాయి. ఇక్కడ ప్రజలు నాయకులపై చాలా ఆశలే పెట్టుకుంటారు. వరుసగా గెలిపించేటటువంటి మనస్తత్వం ఉన్న నాయకులు ప్రజలు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు.
ఇదే గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన డిఎల్ రవీందర్ రెడ్డి కి కలిసి వచ్చింది. ఆ తర్వాత వరు స విజయాలు దక్కించుకున్న శెట్టిపల్లి రఘురాం రెడ్డికి కూడా కలిసి వచ్చింది. అయితే, కూటమి హవాలో గత ఎన్నికల్లో మాత్రం శెట్టిపల్లి ఓడిపోయినా... మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని పుట్టా సుధాకర్ యాదవ్ తన అడుగులను జాగ్రత్తగా వేయడంతో పాటు ప్రజలను కలుసుకో వడం ప్రజలతో ఉండటం ద్వారా మాత్రమే ఆయన వచ్చేసారి విజయం దక్కించుకునేందుకు, ప్రజల మనసులు చూడగలం ఎందుకు అవకాశం ఉంటుంది.
కానీ, ఇప్పటివరకు అయితే ఆయన పట్ల ప్రజల సానుకూలత చాలా చాలా తక్కువ రేంజ్ లోనే ఉందని సర్వేలు చెబుతున్నాయి, కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పుట్ట అడుగులు పడకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు అనేది సర్వేల అంచనా. మరి ఏం చేస్తారో చూడాలి.
