Begin typing your search above and press return to search.

పుతిన్ కాలు బయటపెట్టారు.. నేరుగా యుద్ధంలోకి వెళ్లారు!

ప్రపంచంలో పవర్ ఫుల్ లీడరే కాదు.. అత్యంత ముప్పు పొంచి ఉన్న నాయకుడు కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్.

By:  Tupaki Desk   |   13 March 2025 5:28 PM IST
పుతిన్ కాలు బయటపెట్టారు.. నేరుగా యుద్ధంలోకి వెళ్లారు!
X

ప్రపంచంలో పవర్ ఫుల్ లీడరే కాదు.. అత్యంత ముప్పు పొంచి ఉన్న నాయకుడు కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్. అలాంటి పుతిన్ మూడేళ్ల కిందట ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టాడు. దీంతో పశ్చిమ దేశాలకు ఆయన పెద్ద విలన్ గా మారిపోయారు.

పుతిన్ తమ దేశం విడిచి ఇతర దేశాలలో పర్యటించడం చాలా అరుదు. ఇక ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక పరిస్థితి మరింత క్లిష్టం కావడంతో ఆయన చాలా అరుదుగా రష్యా నుంచి బయటకు వస్తున్నారు. ఒకప్పటి సోవియట్ యూనియన్ దేశాల్లో తప్ప ఇతర దేశాల్లో పర్యటించింది చాలా తక్కువే అని చెప్పాలి.

కానీ పుతిన్ తాజాగా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ నుంచి బయటకు వచ్చారు. నేరుగా యుద్ధ భూమిలోకి వెళ్లారు. ఈ ప్రదేశం పేరు కర్క్స్. ఇది పశ్చిమ రష్యాలో ఉక్రెయిన్ కు సరిహద్దున ఉంది. అయితే, ఉక్రెయిన్ బలగాలు కొన్ని నెలల కిందట కర్క్స్ ను ఆక్రమించాయి. ప్రస్తుతం అక్కడ రష్యా-ఉక్రెయిన్ బలగాల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. రష్యా కొంత వెనుకబడి ఉంది. దీంతో పుతిన్ కర్క్స్ లో పర్యటించారు.

సైనిక దుస్తుల్లో కర్క్స్‌ లో ఉన్న రష్యా దళాల కంట్రోల్‌ సెంటర్‌ ను సందర్శించిన పుతిన్.. యుద్ధ భూమిలోని పరిస్థితులను సైనిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి ఉక్రెయిన్ సైన్యాన్ని వెళ్లగొట్టాలని పుతిన్ ఆదేశాలు జారీ చేశారు.

యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఒప్పుకొంది. రష్యాను ఒప్పించేందుకు అమెరికా ప్రతినిధులు ఆ దేశానికి చేరుకున్నారు.