Begin typing your search above and press return to search.

ఈ ఒక్క పదవి చాలు...పురంధేశ్వరి కామెంట్స్

తాను రెండేళ్ళ పాటు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని పూర్తి చేశాను అని దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు.

By:  Tupaki Desk   |   1 July 2025 10:28 PM IST
ఈ ఒక్క పదవి చాలు...పురంధేశ్వరి కామెంట్స్
X

తాను రెండేళ్ళ పాటు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని పూర్తి చేశాను అని దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. తాను రెండేళ్ళ క్రితం అమర్నాథ్ ఆధ్యాత్మిక తీర్ధ యాత్రలో ఉన్నపుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు ఫోన్ చేసి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఎన్నిక అయ్యారు అని చెప్పారు అని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఈ రెండేళ్ళ కాలంలో అందరూ అన్ని విధాలుగా తనకు సహకరించినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన ఈ ప్రయాణంలో అందరూ అండగా నిలబడ్డారు అన్నారు. అలా తనను ప్రోత్సహించిన వారికి అలాగే తనను ప్రతిఘటించిన వారికి ధన్యవాదాలు అని ఆమె చెప్పడం విశేషం.

ఇక కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉందని ఈ నేపథ్యంలో మనం వేసే ప్రతె అడుగు మాట్లాడే ప్రతీ మాట ఆచీ తూచీ ఉండాలని ఆమె కొత్త సూచించారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా పదవులు ఉంటే రెండేళ్ళు లేదా మూడేళ్ళు ఉంటాయని కానీ ఒక పదవి మాత్రం తన నుంచి ఎవరూ దూరం చేయలేరు అని ఆమె అన్నారు. ఆ పదవి కార్యకర్త అని అని ఆమె చెప్పారు. తాను పదవులు ఎన్ని చేపట్టినా ఒక కార్యకర్తలా మళ్ళీ వారి మధ్యలోనే ఉంటాను అని అన్నారు. తాను కార్యకర్త పదవికే ఇక మీదట న్యాయం చేస్తాను అని ఆమె అనడం విశేషం.

మొత్తానికి చూస్తే పురంధేశ్వరి చేసిన ఈ వ్యాఖ్యల మీద చర్చ సాగుతోంది. ఆమెని పిలిచి పదవి ఇచ్చి రెండేళ్ళకే కార్యకర్తగా మార్చేశారని ఆవేదన ఉందా అని అంటున్నారు. అంతే కాదు కేంద్ర మంత్రి పదవి మీద ఆమె ఆశలు పెట్టుకుంటే అది కూడా దక్కలేదు.

దాంతోనే ఆమె తన నుంచి కార్యకర్త పదవిని దూరం చేయలేరు అన్న మాటలు వచ్చాయా అని చర్చించుకుంటున్నారు. ఇక తనను పార్టీలో ప్రతిఘటించిన వారికి ధన్యవాదాలు అని సెటైర్లు వేశారు. ఏపీ బీజేపీలో ఆమెని ప్రతిఘటించిన వారు ఎవరు అన్నది కూడా ఆలోచిస్తున్నారు.

ఇదిలా ఉంటే పురంధేశ్వరిది బీజేపీలో 11 ఏళ్ల రాజకీయ ప్రయాణం. ఆమె సాధించింది బీజేపీ ప్రెసిడెంట్ పదవి అలాగే ఒక సారి ఎంపీ అని అంటున్నారు. అధికారిక హోదాలు అయితే ఇప్పటిదాకా ఆమెను వరించలేదు అని గుర్తు చేస్తున్నారు.

మరి కేంద్రంలో ఇంకా నాలుగేళ్ళ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆమెకు ఏమైనా మంచి స్థానం ఇస్తారా అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. మొత్తానికి కేంద్ర మంత్రిగా పనిచేసి మూడు సార్లు ఎంపీగా నెగ్గిన ఆమె బీజేపీలో ఒక కార్యకర్తను తాను అని అనడం అంటే ఆమె ఏమైనా అసంతృప్తితో ఈ మాటలు అన్నారా లేక మామూలుగానే అన్నారా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు.