జనసైన్యం చెవులకు ఫుల్ ఖుషీగా ఉందట !
ముఖ్యమంత్రి కావాలన్నది జనసైనికుల కోరిక. అయితే సీఎం పోస్టుకు పవన్ ఎంత దగ్గరలో ఉన్నారో కాలమే చెప్పాలి.
By: Tupaki Desk | 27 Jun 2025 5:00 AM ISTఅవును మంచి మాటలను చెవులు వినాలని అనుకుంటుంది. మంచి వాటిని చూడాలని కళ్ళు అనుకుంటాయి. మంచిగా అంతా జరగాలని మనసు అనుకుంటుంది. ఇక ఏ పార్టీలో ఉన్న క్యాడర్ కి అయినా తమ నాయకుడే గొప్ప. ఆయనే దైవం. ఆయనే హీరో. ఇందులో ఏ మాత్రం తప్పు లేదు, పొరపాటు అంతకంటే లేదు ఇది సహజసిద్ధమైన విషయమే.
అయితే ఒక్కోసారి ఆశలు తీరడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనుకుంటూ ఉంటారు అంతా. ఇదంతా ఎందుకు అంటే జనసేన కార్యకర్తలకు పవన్ దేవుడు. ఆయన వెండి తెర మీద పవర్ స్టార్. మరి రియల్ లైఫ్ లో కూడా హీరోగానే ఉండాలని కోరుకుంటారు రాజకీయ తెర మీద చూస్తే పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ముఖ్యమంత్రి కావాలన్నది జనసైనికుల కోరిక. అయితే సీఎం పోస్టుకు పవన్ ఎంత దగ్గరలో ఉన్నారో కాలమే చెప్పాలి కానీ ఈలోగా తమ ఆశలను క్యాడర్ దాచుకోకుండా సీఎం అని ఆయన సభలో కనిపించినపుడల్లా అంటూనే ఉంటుంది. చెవులు చిల్లులు పడేలా హోరెత్తిస్తూనే ఉంటుంది.
అటువంటిది జనసైన్యం చెవులకు ఖుషీని ఇచ్చే విధంగా ఒక మాట వినిపిస్తే ఊరుకుంటారా. అసలు ఊరుకోరు. ఏ మాత్రం వెనక్కి తగ్గరు. పొరపాటు అయినా తడబాటు అయినా కూడా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ అయిన దగ్గుబాటి పురందేశ్వరి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అనేశారు.
అంతే ఇది జనసైన్యం చెవులకు ఎంతలా సోకిందంటే ఒక మధుర స్వరంగా అని చెప్పాలి. ఒక తీయని పాటలా అని కూడా చెప్పాలి. వీనుల విందు అని కూడా అనాల్సిందే. అందుకే వారు ఆ పొరపాటు మాటను సైతం సోషల్ మీడియలో తెగ వైరల్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్. ఈ రెండూ కలిపి చదువుకున్నా ఆనందమే. చెవులకు వినిపించినా మహదానందమే. అందుకే వారు దానిని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు.
బాగా ఆస్వాదిస్తున్నారు. మా పవన్ సీఎం అయ్యారని సంబరపడుతున్నారు. కొన్ని క్షణాల పాటు అయినా పవన్ సీఎం అని వినిపించడం మాత్రం వారు తమ చెవులలో ఎప్పటికీ అలాగే సుస్వరంగా ఉంచుకుంటూ జోష్ అవుతామనే అంటున్నారు.
ఇది ఫక్తు రాజకీయం. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్న సామెత ఎటూ ఉంది. అందువల్ల పవన్ కళ్యాణ్ సీఎం కావచ్చేమో. చరిష్మాటిక్ లీడర్ గా ఆయన ఉన్నారు. రాజకీయంగా ఆయనకు ఉండాల్సినవన్నీ ఉన్నాయి. అంగ బలం అభిమాన బలం పుష్కరలంగా ఉంది. వై నాట్ అన్నదే వారి మాట. మొత్తానికి చిన్నమ్మ నోటి వెంట పెద్ద మాటే వచ్చింది. అది పవన్ కి జనసేనకు మహాశీర్వాదమై జనసేన జాతకాన్ని కొత్త మలుపులు తిప్పే రోజు కచ్చితంగా వస్తుందని జనసైన్యం ఆశిస్తే అందులో తప్పేముంది.
