ఎస్సీ ఓట్లపై చిన్నమ్మ కన్ను.. వర్కవుట్స్ ఇవే ..!
తాజాగా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణను కూడా పార్టీలోకి చేర్చుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న మురళీ కృష్ణ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
By: Tupaki Desk | 24 Jun 2025 5:00 AM ISTరాష్ట్రంలో పార్టీని పుంజుకునేలాచేయాలని భావిస్తున్న బీజేపీ కీలక నాయకులకు టార్గెట్లు పెట్టినట్టు కనిపి స్తోంది. ఈ క్రమంలో ఎస్సీ ఓటు బ్యాంకును కైవసం చేసుకునేందుకు పార్టీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురందే శ్వరి శ్రీకారం చుట్టారు. ఎస్సీలను పార్టీలో చేర్చుకోవడంతోపాటు.. వారికి కీలక బాధ్యతలు కూడా అప్పగిం చనున్నారు.అ లానే.. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఎస్సీ నియోజకవర్గాల్లో పర్యటించి.. సమస్యలు తెలుసు కునేందుకు ప్రాధాన్యంఇస్తున్నారు.
వాస్తవానికి బీజేపీ అంటే.. అగ్రవర్ణాల పార్టీ అన్న ముద్ర ఉంది. హిందూత్వ అజెండాతో ముందుకు సాగ డం పార్టీ సిద్ధాంతం కూడా.అయితే.. ఏపీ వంటి ఎస్సీ నియోజకవర్గాలు ఎక్కువగా ఉండడం.. మాల, మాదిగ సామాజిక వర్గాల ఓటు బ్యాంకు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇదే సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడితే కష్టమని భావిస్తున్న బీజేపీ తనను తాను మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎస్సీ మోర్చాను బల పరుస్తోంది.
తాజాగా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణను కూడా పార్టీలోకి చేర్చుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న మురళీ కృష్ణ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈయనతో పాటు.. ఇతర ఎస్సీ నియోజకవర్గాల్లోని కార్యకర్తలను కూడా పార్టీలోచేర్చుకున్నారు. ఇక, ఈ నెలలోనే ఎస్సీ నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయించారు. తద్వారా ఎస్సీల ఓటు బ్యాంకును సొంతం చేసుకునేం దుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ తరహా కులాల ప్రాతిపదికన బీజేపీ ప్రజలకు చేరువ కావడంఇదే తొలిసారి. వాస్తవానికి బీజేపీ అంటేనే హిందువులకు సంబంధించిన పార్టీ అనే ముద్ర ఉంది. కానీ, ఎస్సీల్లో హిందువులతో పాటు క్రిస్టియానిటినీ పాటించేవారు ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్సీ నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి, ఉపాధి నిధుల వినియోగం వంటివాటిని ప్రస్తావించడం ద్వారా.. పార్టీని పరుగులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఏమేరకు ఎస్సీల ఓటు బ్యాంకు కమల నాథులకుఅ నుకూలంగా మారుతుందో చూడాలి.
