Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల వేళ‌.. పురందేశ్వ‌రి అంత‌ర్మ‌థ‌నం.. రీజ‌నేంటి?

''వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని గౌర‌వ ప్ర‌ద‌మైన స్థానంలో నిల‌బెట్టాలి. క‌నీసం త‌లెత్తుకుని నిల‌బ‌డే స్థాయిలో అయినా.. పార్టీని గెలిపించుకోవాలి.

By:  Tupaki Desk   |   22 Jan 2024 9:30 AM GMT
ఎన్నిక‌ల వేళ‌.. పురందేశ్వ‌రి అంత‌ర్మ‌థ‌నం.. రీజ‌నేంటి?
X

''వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని గౌర‌వ ప్ర‌ద‌మైన స్థానంలో నిల‌బెట్టాలి. క‌నీసం త‌లెత్తుకుని నిల‌బ‌డే స్థాయిలో అయినా.. పార్టీని గెలిపించుకోవాలి. ఇది నామీద పార్టీ పెట్టిన బాధ్య‌త‌``- ఓ ఆరు మాసాల‌కు ముందు బీజేపీ ఏపీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.. ఉర‌ఫ్‌.. చిన్న‌మ్మ చేసిన వ్యాఖ్య‌లు ఇవి. పార్టీ బాధ్య త‌లు చేప‌ట్టే ముందు.. ఆమె పార్టీ కేడ‌ర్‌కు చేసిన దిశానిర్దేశం కూడా ఇదే. అయితే.. పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టి ఆరు మాసాలు అవుతున్నా.. ఇప్ప‌టికీ ఎక్క‌డా బీజేపీ బ‌లోపేతం కాలేదు. ఎక్క‌డా క‌మ‌లం పార్టీ ఊసు క‌నిపించ డం లేదు.

నిజానికి ఇప్పుడు అన్ని పార్టీల‌కూ.. కీల‌క స‌మ‌యం న‌డుస్తోంది. దాదాపు 40 నుంచి 50 రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించి అధికార పార్టీ వైసీపీ అభ్య ర్థుల‌ను కూడా ఖ‌రారు చేస్తోంది. ఇక‌, టీడీపీ-జ‌న‌సేన కూడా ఉమ్మ‌డి గా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకు న్నాయి. బ‌హిరంగ స‌భ‌లు, ప్ర‌చారాలు, అభ్య‌ర్థుల ఎంపిక‌, ప్ర‌జ‌ల‌కు ఇచ్చే హామీలు, మేనిఫెస్టోలు, చేరికలు .. తీసివేత‌లు.. ఇలా అనేక ప‌నుల‌తో పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి.

అయితే.. ఎంతో ల‌క్ష్యంతో జాతీయ పార్టీ ప‌గ్గాలుచేప‌ట్టిన పురందేశ్వ‌రి మాత్రం ఎక్క‌డా ఈ తాలూకు దూకు డు చూపించ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏం అడిగినా.. అంతా అధిష్టానం చూసుకుంటుంది.. పైనున్న నాయ‌కులు తేలుస్తారు.. అనే సెల‌విస్తున్నారు. పోనీ.. ఇదే నిజ‌మ‌ని అనుకున్నా..రేపు ఎవ‌రికి టికెట్ ఇస్తే.. బెట‌ర్ అని కేంద్రంలోని పెద్ద‌లు ప్ర‌శ్నిస్తే.. చూపించేందుకు వివ‌రించేందుకు అయినా.. అభ్య‌ర్థుల జాబితా ఒక‌టి ఆమె సంపాయించుకోవాలి క‌దా! అనే చ‌ర్చ ఉంది. కానీ, దీనికి కూడా ఆమె ద‌గ్గ‌ర స‌మాధానం లేదు.

మొత్తంగా ఎన్నిక‌ల విష‌యాన్ని, అభ్య‌ర్థుల విష‌యాన్ని ప్ర‌జ‌ల మ‌న‌సులు చూర‌గొనే విష‌యాన్ని ఇలా.. అన్ని విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టి.. కేవ‌లం ఒక ఉద్యోగిగా మాత్రమే పురందేశ్వ‌రి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అయితే.. దీనికి ఒక కార‌ణం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆమెకు ఏ విష‌యంలోనూ స్వ‌తంత్ర‌త లేకుండా.. అన్ని అధికారాల‌ను అధిష్టానం త‌న‌వ‌ద్దే పెట్టుకుని పురందేశ్వ‌రికి కేవ‌లం ప‌గ్గాలు మాత్ర‌మే అప్ప‌గించార‌ని.. అందుకే ఆమె ఈ విష‌యాల్లో దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక పోతున్నార‌ని అంటున్నారు.