Begin typing your search above and press return to search.

అధికారి చేత నిప్పు పెట్టించారు పంజాబ్ రైతుల రూటే సపరేటు

ఢిల్లీకి సమీపంలోని పంజాబ్ లోని పలువురు రైతులు తమ పంట వ్యర్థాలకునిప్పు పెట్టేస్తుంటారు. అదెంత భారీగా ఉంటుందంటే.. దీని కాలుష్యం దేశ రాజధానిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

By:  Tupaki Desk   |   6 Nov 2023 4:30 AM GMT
అధికారి చేత నిప్పు పెట్టించారు పంజాబ్ రైతుల రూటే సపరేటు
X

వద్దన్న పని చేసే విషయంలో కొన్ని రాష్ట్రాల్లోని వారి తీరు చూస్తే విస్మయానికి గురి చేస్తుంది. తమ చర్యలతో చుట్టు ఉన్న వారికి ఇబ్బందులు గురిఅవుతాయని చెప్పినా.. పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించే విషయంలో పంజాబ్ రాష్ట్ర రైతులు మహా మొండిగా ఉంటారన్న పేరుంది. అందుకు తగ్గట్లే తాజాగా వారి తీరు ఉంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమైన వాయుకాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా.. అందుకు అందరి సహకారం అందని పరిస్థితి.

ఢిల్లీకి సమీపంలోని పంజాబ్ లోని పలువురు రైతులు తమ పంట వ్యర్థాలకునిప్పు పెట్టేస్తుంటారు. అదెంత భారీగా ఉంటుందంటే.. దీని కాలుష్యం దేశ రాజధానిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రస్తుతం చలి ఎక్కువగా ఉండటం.. దీనికి తోడు వాయు కాలుష్యం మరింత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పలుప్రాంతాల్లో పంట వ్యర్థాల్ని తగలబెట్టకుండా అధికారుల చేత పర్యవేక్షిస్తున్నారు.

ఈ క్రమంలో బఠిండాకు చెందిన కొందరు రైతులు వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. పంట వ్యర్థాల్ని తగలబెట్టే రైతుల చర్యను అడ్డుకునేందుకు పంపిన అధికారి చేతనే.. అక్కడి రైతులు బలవంతంగా నిప్పు పెట్టించిన ఘటన షాకింగ్ గా మారింది. ఓవైపు ఢిల్లీ తీవ్రమైన వాయు కాలుష్యంతో సతమతమవుతుంటే.. ఆ విషయాల్ని పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్న పంజాబ్ రైతుల తీరును పలువురు తప్పు పడుతున్నారు.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ప్రభుత్వ అధికారి చేత బఠిండా సమీపానికి రెందిన మెహమా సర్జా గ్రామానికి చెందిన రైతులు పంట వ్యర్థాల్ని తగలబెట్టకుండా అడ్డుకున్న అధికారి చేతనే నిప్పు పెట్టించారు. దీనికి సంబంధించిన వీడియో తీసి పోస్టు చేయటంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ వ్యవహారంపై పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం తప్పు పట్టారు. రైతుల చర్యపై అగ్రహం వ్యక్తం చేస్తూ.. చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ క్రమంలో పంట వ్యర్థాల్ని అధికారి చేత తగలబెట్టించిన రైతులపై కేసులు నమోదు చేశారు. వారిపై చర్యలకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు