రూ. 6 తో ఒక్కరోజులో కోటీశ్వరుడు.. ఆ డబ్బులతో ఏం చేస్తానని ఫిక్స్ అయ్యాడంటే..?
పంజాబ్ లోని కూలి ఒకే ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు. ఆయన కథ తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగకమానదు.
By: Tupaki Desk | 17 July 2025 3:33 PM ISTసుమతీ శతకంలో ఒక పద్యం గుర్తుందా..? ‘సిరితా వచ్చిన వచ్చును సలలితముగ నారకేశ సలిలము భంగిన్’. ప్రస్తుతం శతకంలో రెండో సగం పక్కన పెడతాం. సంపద అనేది కొబ్బరి కాయలో నీటిలాగా ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదుగా.. అదే విధంగా కోటగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.. గుమ్మడి పండు అంత టాలెంట్, కష్టం ఉన్నా.. ఆవగింజంత అదృష్టం లేకుంటే ఏమీ చేయలేమని. అలాంటిదే లక్కీ లాటరీ కూడా. ఈ లాటరీలు పేదవాడిని ఒక్కసారిగా కోటీశ్వరుడిని చేస్తుంది. కేరళలో ఓనమ్ పండుగ సందర్భంగా లాటరీ ఏర్పాటు చేస్తారు. దాదాపు 30 కోట్లకు పైగా బంపర్ ప్రైజ్. ఈ లాటరీ వరించడం కూడా అదృష్టమే.
పంజాబ్ లోని కూలి ఒకే ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు. ఆయన కథ తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగకమానదు. పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాకు చెందిన జస్మాయిల్ సింగ్ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు. రోజు కూలి చేస్తేనే కుటుంబం పొట్టనిండేది. కోట్లు ఉండాలని కాదు.. రోజు కుటుంబం కడుపు నింపడం తప్ప ఆయనకు పెద్దగా ఏ కోరికలు లేవు. అయితే ఒక రోజు పని ఉందని ఫిరోజ్ పూర్ కు వెళ్లాడు. అక్కడ ఆయన దృష్టి లాటరీ టికెట్ పై పడింది. తన వద్ద తక్కువ డబ్బే ఉంది. సరే చాయ్ తాగడం పక్కన పెట్టి ఒక టికెట్ కొందాం అనుకున్నాడట.
జస్మాయిల్ సంగ్ రూ. 6 పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాడు. ఇంటికి తిరిగి వచ్చాడు. కొన్ని గంటలు గడిచిన తర్వాత ఆయనకు ఒక ఫోన్ వచ్చింది. ‘మీరు కొన్న లాటరీకి బంపర్ ప్రైజ్ వచ్చింది’ అని ఆ ఫోన్ సారాంశం. మొదట ఆయన నమ్మలేదట. మరోసారి రీకాల్ చేసి కన్ఫమ్ చేసుకున్న తర్వాత ఖుషీ అయ్యాడు. కనీసం లక్షాధికారి అయినా చాలని అనుకుటున్న ఆయన ఏకంగా కోటీశ్వరుడు అయ్యాడు.
ఆయన లాటరీకి రూ. కోటి ప్రైజ్ మనీ గెలుచుకుంది. ఇంత డబ్బుతో ఏం చేస్తావని ఆయనను మీడియా అడగడంతో కుటుంబంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అన్నారట. మొదట నాకున్న అప్పు రూ. 25 లక్షలు కడతానని, ఆయన తర్వాత నా భార్య విర్పాల్ కౌర్ తో మాట్లాడి పిల్లల భవిష్యత్ కు కొంచెం పక్కన పెడతానని చెప్పాడు. రోజు కూలి అయిన ఆయనకు కోటి రూపాయలు రావడంతో స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.
