డెలివరీ బాయ్ రే*ప్ చేశాడని టెక్కీ ఫిర్యాదు... కట్ చేస్తే బిగ్ ట్విస్ట్!
అవును... తనపై ఓ డెలివరీ ఏజెంట్ అత్యాచారం చేశాడని, అంతకంటే ముందు తనను అపస్మారక స్థితిలోకి నెట్టాడంటూ ఓ మహిళా టెకీ పోలీసులకు ఫిర్యాదు చేసింది!
By: Tupaki Desk | 22 July 2025 3:38 PM ISTపూణేలోని తన అపార్ట్ మెంట్ లో డెలివరీ ఏజెంట్ గా నటిస్తూ ఒక వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని 22 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ ఆరోపణ చేసింది. ఈ మేరకు జూలై 3న ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా... ఒక డెలివరీ ఏజెంట్ తన ఫ్లాట్ లోకి ప్రవేశించి, తనను అపస్మారక స్థితిలోకి నెట్టి, అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఇందులో బిగ్ ట్విస్ట్ నెలకొంది.
అవును... తనపై ఓ డెలివరీ ఏజెంట్ అత్యాచారం చేశాడని, అంతకంటే ముందు తనను అపస్మారక స్థితిలోకి నెట్టాడంటూ ఓ మహిళా టెకీ పోలీసులకు ఫిర్యాదు చేసింది! అయితే ఈ ఫిర్యాదుపై జరిపిన దర్యాప్తులో.. అది కట్టుకథ అని తేలింది. దీంతో... పోలీసులు రివర్స్ లో ఆమె పైనే కేసు నమోదు చేశారు. ఈ విషయం నెట్టింట సంచలనంగా మారుతుంది!
వివరాళ్లోకి వెళ్తే... ఓ వ్యక్తి డెలివరీ ఏజెంట్ గా నటిస్తూ తనపై అత్యాచారం చేశాడని పుణెకు చెందిన ఓ టెకీ (22) ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో... అతడు దొంగతనంగా తన ఫ్లాట్ లోకి వచ్చాడని.. తనను స్పృహ కోల్పోయేలా చేసి, అత్యాచారం చేశాడని పేర్కొంది! ఆ సమయంలో.. ఆ వ్యక్తి తన ఫొటోలు తీశాడని ఆరోపించింది.
అంతేకాదు.. ఈ విషయం బయటకు చెప్తే వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరిస్తూ మెసేజ్ లు చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించి పలు సాక్ష్యాలను కూడా ఆమె సమర్పించిందని చెబుతున్నారు. దీంతో... ఫిర్యాదును సీరియస్ గా పరిగణించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు! ఇక్కడే బిగ్ ట్విస్ట్ తెరపైకి రావడంతో షాక్ అయ్యారని అంటున్నారు.
ఈ సందర్భంగా... డెలివరీ ఏజెంట్ గా తన ఫ్లాట్ లోకి వచ్చిన ఆ వ్యక్తి సదరు టెకీ స్నేహితుడేనని పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో... ఆమెపై ఎలాంటి అత్యాచారం జరగలేదని అన్నారు. కావాలనే ఆమె పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు కేసు పెట్టిందని తెలిపారు. దీంతో తిరిగి ఆమె పైనే పోలీసులు కేసు నమోదు చేశారు.
