'పులివెందుల' ఫైటింగ్‌లో జెడ్పీటీసీ.. స్మాల్ ఇష్యూ.. !
గత ఎన్నికల్లోనే ఆయన ఓడిపోయారు. ఇప్పుడు తన సతీమణిని రంగంలోకి దింపారు. ఇప్పుడు ఈ సీటు లో విజయం దక్కించుకోవడం కుటుంబ పరంగా ప్రాధాన్యం దక్కించుకుంది.
By: Tupaki Desk | 10 Aug 2025 1:53 AM ISTవైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక వ్యవ హారం తీవ్రస్థాయిలో రాజకీయ ఫైటింగుకు రీజన్‌గా మారింది. ఒకవైపు రాజకీయం.. మరోవైపు వివేకానంద రెడ్డి దారుణ హత్యకు సంబంధించిన సెంటిమెంటు కూడా తెరమీదికి వచ్చింది. ఈ పరిణామాలతో ఈ ఉప ఎన్నిక వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది. పులివెందులలో పాగా వేయాలని టీడీపీ అధినేత పదే పదే చెబుతున్నారు. తాజాగా కూడా పార్టీ నాయకులకు గెలుచుకుని రావాలంటూ.. పిలుపునిచ్చారు.
పులివెందుల జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరమణ మృతి చెందిన నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక అనివార్య మైంది. దీంతో పాటు ఇదే కడప జిల్లాలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కూడా ఉప పోరు జరుగుతోంది. అయితే.. ఒంటిమిట్టపై లేని ఫోకస్ పులివెందులపైనే ఉంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపి స్తున్నాయి. వాస్తవానికి జెడ్పీటీసీ ఉప ఎన్నిక స్మాల్ ఇష్యూనే. కానీ.. వ్యక్తిగతంగా టీడీపీ సీనియర్ నాయకు డు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కుటుంబానికి ఇది ప్రతిష్టాత్మకంగా మారింది.
గత ఎన్నికల్లోనే ఆయన ఓడిపోయారు. ఇప్పుడు తన సతీమణిని రంగంలోకి దింపారు. ఇప్పుడు ఈ సీటు లో విజయం దక్కించుకోవడం కుటుంబ పరంగా ప్రాధాన్యం దక్కించుకుంది. అందుకే తీవ్రస్థాయిలో పోరు సాగిస్తున్నారు. ఇది వివాదాలకు.. ఘర్షణలకు కూడా దారితీస్తోంది. ఇక, పార్టీ పరంగా కూడా.. ఈ స్థానం కీలకం. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా విజయం దక్కించుకుని.. జగన్ హవాను పూర్తిగా తుడిచి పెట్టాలన్నది టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతను స్థానిక నాయకులు రెడ్డప్పగారి. శ్రీనివాసరెడ్డి సహా.. బీజేపీలో ఉన్న ఆదినారాయణపై కూడా పెట్టారు.
దీంతోనే పులివెందుల జెడ్పీటీసీ ఉప పోరు ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి.. ఇక్కడ ఎవరు గెలిచినా.. మహా అయితే.. ఏడాదిన్నరకు మించి అధికారంలో ఉండే అవకాశం లేదు. అయినా.. దీనికి ఇంత ఇంపార్టెన్స్ పెరగడానికి.. వచ్చే ఎన్నికలే కీలకం. దీనికి తోడు బీటెక్ రవి ప్రతిష్టాత్మకంగా తీసుకో వడం. మరోవైపు.. తమ పట్టునిలుపుకొనేందుకు.. వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిణామాలతోనే రాజకీయంగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది.
