Begin typing your search above and press return to search.

చంద్రబాబు ప్రమాణంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన ఆమె!

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవం మొత్తం ఆహ్లాద వాతావరణంలో జరగటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Jun 2024 12:09 PM IST
చంద్రబాబు ప్రమాణంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన ఆమె!
X

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవం మొత్తం ఆహ్లాద వాతావరణంలో జరగటం తెలిసిందే. ఈ వేడకకు పెద్ద ఎత్తున ప్రముఖులు.. ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాజకీయ.. సినీ రంగాలకు చెందిన వారే కాదు.. వ్యాపార.. ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వందలాది ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో ఒకరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆమె గురించి పలువురు మాట్లాడుకోవటం కనిపించింది. కెమెరా కళ్లు సైతం ఆమెకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వటం కనిపించింది.

ఆమెకు చెందిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంతకూ ఆమె ఎవరు? అన్న విషయంలోకి వెళితే.. ఆమె పులివర్తి త్రిషా రెడ్డి. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన పులివర్తి నాని కోడలే ఈ త్రిషారెడ్డి. ప్రమాణమహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా మారిన ఆమె.. తన అత్తమామలు.. భర్తతో కలిసి ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే పులివర్తి నానిది లవ్ మ్యారేజ్ కాగా.. ఆయన కుమారుడు కం డాక్టర్ గా పని చేస్తున్న ఆయన కూడా త్రిషారెడ్డిని ప్రేమించి పెళ్లాడారు. చంద్రగిరి నియోజకవర్గంలో చిన్న పిల్లల కోసం మెడికల్ క్యాంపుల్ని నిర్వహించటం ద్వారా మంచి పేరును సొంతం చేసుకున్నారు త్రిషారెడ్డి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన మామ గెలుపు కోసం ఆమె చేసిన ప్రచారం అందరిని ఆకర్షించింది.

తన మామ పులిపర్తి నానికి ఓటేయాలని కోరుతూ ఆమె చేసిన వీడియో వైరల్ గా మారింది. వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే చంద్రగిరిలో ఈసారి తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఈసారి చెవిరెడ్డి చంద్రగిరి నుంచి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయగా.. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే.