ఆ ఏపీ మంత్రి అంతే.. మారరంటే మరరా...?
దీంతో మంత్రుల వ్యవహారం ఇంతేనా? అనేది పబ్లిక్ టాక్. మరి ఇది మున్ముందు ఎటు దారి తీస్తుందో చూడాలి.
By: Tupaki Desk | 27 April 2025 11:30 AMకూటమి సర్కారులోని కొందరు మంత్రులపై పబ్లిక్ టాక్ భిన్నంగా ఉంది. కొందరు పనిచేస్తుంటే.. మరి కొందరు ప్రచారానికి పరిమితం అవుతున్నారని ప్రజలే చెబుతున్నారు. మరికొందరు కేవలం ప్రతిపక్షంపై విమర్శలు చేసేందుకు మాత్రమే పరిమితంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఉదాహరణకు నిమ్మల రామానాయుడు గురించిపాజిటివ్ టాక్ ఉంది. ఆయనను పనిరాక్షసుడిగా పేర్కొంటున్నారు.
అదేసమయంలో కొండపల్లి శ్రీనివాస్ వ్యవహారం.. హైప్రొఫైల్‌గా ఉందని ప్రజలే చెబుతున్నారు. ఆయన ఎవరినీ కలవరు. కలిసినా... రెండు మూడు నిమిషాలకు మించి మాట్లాడడం లేదు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు ఉన్నారని చెబుతున్నారట. ఇక, హోం మంత్రి అనిత వ్యవహారం.. హోం శాఖలోనే చర్చగా మారింది. విషయంపై పెద్దగా పట్టులేదని ప్రత్యక్షంగా ఆమె గురించి కామెంట్లు వినిపిస్తున్నాయి.
సత్యకుమార్ యాదవ్ బీజేపీ నాయకుడే అయినా.. ఆయన గురించి కొంత పాజిటివ్ టాక్ మరింత ఎక్కువ గా నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. ఆయన వ్యవహారం కూడా.. పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ చర్చగానే ఉంది. మహిళా మంత్రుల్లో సవిత నియోజకవర్గంలో మైనస్ అవుతున్నారు. రాష్ట్రంలో ప్లస్ అవుతున్నారు. ఆమె వయసు రీత్యా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. మంత్రిగా బాగానే పనిచేస్తున్నారు. కానీ, నియోజకవర్గంలో రాజకీయాలను లైన్‌లో పెట్టలేక పోతున్నారని ప్రజలు చెబుతున్నారు.
ఇక, అన్ని విషయాలను మంత్రి నారా లోకేష్ చూస్తున్నారన్నది మరోటాక్. ఇది మంచిదే అయినా.. ప్రతి విషయం ఆయనకు చెప్పాలని మంత్రులు చెబుతుండడం చూస్తే.. కొంత వరకు.. ఇబ్బందిగానే ఉంది. ఇటీవల ఉమ్మడి గుంటూరుకు చెందిన మంత్రి ఒకరు.. మంత్రిని అడిగి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కానీ, ఆయన సీనియర్ నాయకుడు. దీంతో మంత్రుల వ్యవహారం ఇంతేనా? అనేది పబ్లిక్ టాక్. మరి ఇది మున్ముందు ఎటు దారి తీస్తుందో చూడాలి.