Begin typing your search above and press return to search.

ఇలాగైతే ఎలాగ జగనూ ?

ఏపీని అతి పెద్ద తుఫాన్ వణికించింది. మొంథా పేరుతో వచ్చిన భయంకరమైన తుఫాన్ అది. ఏపీ మొత్తాని కవర్ చేసి పారేసింది.

By:  Satya P   |   29 Oct 2025 2:15 PM IST
ఇలాగైతే ఎలాగ  జగనూ ?
X

ఏపీని అతి పెద్ద తుఫాన్ వణికించింది. మొంథా పేరుతో వచ్చిన భయంకరమైన తుఫాన్ అది. ఏపీ మొత్తాని కవర్ చేసి పారేసింది. ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు, అన్నీ తీవ్రంగానే తుఫాన్ తాకిడికి గురి అయ్యాయి. తుఫాన్ సమాచారం అందుకున్న ఏపీలో అంతా ఎవరి పరిధిల్లో వారు విధులను నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మూడు రోజుల పాటు రోజులు పన్నెండు గంటలకు తక్కువ లేకుండా ఏడున్నర పదుల వయసులో అవిశ్రాంతంగా పరిశ్రమించారు. మంత్రి నారా లోకేష్ కూడా అదే విధంగా ఆర్టీజీఎస్ కేంద్రాన్ని అట్టిపెట్టుకొని నిరంతరం అందరికీ అలెర్ట్ చేస్తూ అంతా కో ఆర్డినేట్ చేస్తూ ముందుకు సాగారు. ఏపీలోని మంత్రులు మొత్తం ఎక్కడివారు అక్కడ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రజలకు ధైర్యం చెబుతూ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

తాడేపల్లికి దూరంగా :

అయితే మాజీ సీఎం ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మాత్రం ఏపీకి తాడేపల్లికి దూరంగా బెంగళూరులో ఉండిపోయారు. దాంతో ఇపుడు ఆయన మీద టీడీపీ కూటమి నేతలు తీవ్రంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రజలు అంతా తుఫాన్ బారిన పడి అల్లాడుతూంటే జగన్ మాత్రం ఎక్కడో ఉంటారా అని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి జగన్ మంగళవారం విమానంలో తాడేపల్లి రావాలని అనుకున్నారు. కానీ విమాన రాకపోకలు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రద్దు అయ్యాయి. దాంతో ఆయన రావడం లేదని వైసీపీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

రోడ్డు మార్గాన అయినా :

అయితే ఏపీలో ప్రజానీకం మొత్తం కష్టాలలో ఉన్నపుడు జగన్ రోడ్డు మార్గం లో అయినా ఏపీకి వచ్చి ఉంటే బాగుండేది అని అంటున్నారు. ఆయన ఎక్స్ ఖాతా ద్వారా తన పార్టీ శ్రేణులకు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో సహాయ చర్యలలో పాల్గొననమని సూచించారు కానీ జగన్ తాడేపల్లి లో ఉండి పార్టీ నేతలను అక్కడ నుంచి మోనిటరింగ్ చేసి ఉంటే బాగుండేది అని అంటున్నారు. జగన్ కేవలం విపక్ష నేత మాత్రమే కాదు మాజీ సీఎం కూడా అని అంటున్నారు. అయిదు కోట్ల మంది ప్రజలు కష్టాలలో ఉంటే ప్రకృతి పెను సవాల్ విసిరినట్లుగా అతి పెద్ద తుఫాన్ ఏపీ ముంగిట వాలితే కేవలం అధికార పక్షానికే బాధ్యత కాదు కదా అని అంటున్నారు.

ఇలాంటివే కౌంట్ లోకి :

రాజకీయ నేతలు మిగిలిన సమయాల్లో ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారు అన్నది జనాలు అసలు పట్టించుకోరు కానీ తాము కష్టాలలో ఉన్నపుడు నేతలు దూరంగా ఉన్నా లేక పట్టించుకోకపోయినా వారిలో ఆవేశం వస్తుంది. అదే సమయంలో తమ వద్దకు వచ్చే నేతలను కూడా కచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. ఇక జగన్ విషయానికి వస్తే ఆయన వరదలను బురదలను లెక్క చేసే రకం కాదు కానీ బెంగళూరు లో ఉండిపోవడం వల్లనే ఇలా జరిగింది అని అంటున్నారు..

స్పందించి ఆదుకుంటే :

కానీ మొంథా తుఫాన్ అన్నది నాలుగైదు రోజుల నుంచే తన రాక చెబుతోంది. అధికారులు అన్ని చోట్ల అప్రమత్తం చేస్తున్నారు. దాంతో ఒక రోజు ముందుగా తాడేపల్లికి వచ్చి జగన్ పార్టీని అలెర్ట్ చేసి ఉంటే అది మరింతగా రాణింపుగా ఉండేదని అంటున్నారు. ఏది ఏమైనా తుఫాన్ క్రైసెస్ మేంజేమెంట్ విషయంలో బాబు నూరు మార్కులూ కొట్టేశారు అని అంటున్నారు. వైసీపీ నేతలు అంతా ఇపుడు సహాయ కార్యక్రమాలలో పాలు పంచుకుని ప్రభుత్వ సాయం కాకుండా తాము కూడా తోచిన విధంగా స్పందించి ఆదుకుంటే వైసీపీకి శ్రీరామరక్షగా ఉంటుందని అంటున్నారు.