Begin typing your search above and press return to search.

సీఎంఓ పై నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు!

ఈ క్రమంలో ఇటీవల ఆధికారికంగా పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్న ఆయన... ఒక ఇంటర్వ్యూలో కరోనా నాటి సంగతులను గుర్తు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 5:34 AM GMT
సీఎంఓ పై నటుడు పృథ్వీరాజ్  సంచలన వ్యాఖ్యలు!
X

తెలుగు సినిమాల్లో పృథ్వీరాజ్ అంటే చాలా తక్కువ మందికి తెలిసినా.. థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అంటే మాత్రం చాలా మందికి ఠక్కున గుర్తుపడతారు! ఇటీవల కాలంలో తనదైన కామెండీతో అలరిస్తున్న ఆయన... మరోవైపు రాజకీయాలపైనా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో గతంలో వైసీపీ తరుపున ప్రచారం చేస్తూ.. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి పొందారు!

అనంతరం జరిగిన కొన్ని పరిణామాలతో ఆయన ఆ పదవికి.. తదనుగుణంగా వైసీపీకి కూడా దూరమవ్వాల్సి వచ్చింది! అనంతరం పాలిటిక్స్ పై పెద్దగా స్పందించినట్లు కనిపించని పృథ్వీరాజ్... అనంతరం జనసేన తరుపున తన వాయిస్ వినిపించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇటీవల ఆధికారికంగా పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్న ఆయన... ఒక ఇంటర్వ్యూలో కరోనా నాటి సంగతులను గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఏఓ పై సంచలన ఆరోపణలు చేశారు.

అవును... ప్రస్తుతం జనసేన నేతగా ఉన్న నటుడు పృథ్వీరాజ్ ముఖ్యమంత్రి కార్యాలయంపై సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా... సెకండ్‌ వేవ్‌ లో కరోనా బారినపడి.. ఆస్పత్రిలో బెడ్‌ కావాలని సీఎం క్యాంపు ఆఫీస్‌ కు ఫోన్‌ చేసినా ఎవరూ స్పందించలేదని అన్నారు. ఆ సమయంలో నాగబాబు, సాయికుమార్‌ స్పందించి, తన వైపు నిలబడ్డారని అన్నారు. ఆ సమయంలో ఫిల్మ్‌ ఇండస్ట్రీనే తనను ఆదుకుందని తెలిపారు.

ఇదే సమయంలో... పలు రాజకీయ విమర్శలు, ఆరోపణలు, కీలక వ్యాఖ్యలు కూడా చేశారు పృథ్వీరాజ్. ఇందులో భాగంగా... ఏపీలో జగన్‌ ప్రభుత్వం ఏర్పడటానికి కారణం షర్మిలనే అని చెప్పిన ఆయన... జనసేన-టీడీపీ కలిసి మ్యానిఫెస్టో రూపొందిస్తున్నాయని.. వాటిని ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ఇదే సమయంలో... ఓటు విలువను నాటక రూపంలో ప్రతీ ఊళ్లోనూ ప్రదర్శిస్తామని తెలిపారు.

ఇక ఎస్వీబీసీ ఛైర్మన్‌ గా కాంట్రాక్ట్‌ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసినట్లు చెప్పిన పృథ్వీరాజ్... ఆ సమయంలో బ్రహ్మోత్సవాలు చేయడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ఆ సమయంలో ఉత్సవాల్లో ఎక్కడ చూసినా తానే కనిపిస్తుండటంతో కొందరు దాన్ని తీసుకోలేకపోయారని.. ఫలితంగా వివాదాలను సృష్టించారని అన్నారు. ఇప్పుడు బోర్డు సభ్యులు కావాలంటే డబ్బులు ఉంటే చాలని.. అక్కడ నియంతృత్వ పాలన నడుస్తోందని తెలిపారు.