Begin typing your search above and press return to search.

ప్రాపర్టీ ట్యాక్స్-2025లో మార్పులు ఇవే.. ఇక చెల్లింపులు మరింత సులభం..

దీనికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సితారామన్ నిన్న (ఆగస్ట్ 11) లోక్ సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు-2025ను ప్రవేశపెట్టింది.

By:  Tupaki Desk   |   12 Aug 2025 4:57 PM IST
ప్రాపర్టీ ట్యాక్స్-2025లో మార్పులు ఇవే.. ఇక చెల్లింపులు మరింత సులభం..
X

నరేంద్రమోడీ కేంద్రం పగ్గాలు చేపట్టిన తర్వాత చాలా చట్టాలను మారుస్తూ వస్తుంది. బ్రిటీష్ కాలం నుంచి వస్తున్న అనేక చట్టాల్లో అనేక మార్పులు తెచ్చి కొన్నింటిని సైతం తొలగించింది. న్యాయ వ్యవస్థ పేరు ఇండియన్ పీనల్ కోడ్ ను మార్చి భారత న్యాయ సంహిత పేరును తీసుకువచ్చింది. అలాగే అందులోని చట్టాలను కూడా మార్పులు, సవరణలు చేపట్టింది. ఇందులో భాగంగా మరో చట్టాన్ని సవరించేందుకు మోడీ కేబినెట్ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సితారామన్ నిన్న (ఆగస్ట్ 11) లోక్ సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు-2025ను ప్రవేశపెట్టింది. దీన్ని సభ కేవలం మూడు నిమిషాల్లోనే ఆమోదించింది.

ఇప్పటికే లోక్ సభ ఆమోదం..

లోక్ సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకు వెళ్లి అక్కడ కూడా ఆమోదం పొంది, రాష్ట్రపతి సంతకం అనంతరం చట్టంగా మారి అమలవుతుంది. ఈ బిల్లు 1961 ఆదాయపు పన్ను బిల్లును పూర్తిగా మార్చబోతోంది. ఈ బిల్లులో ప్రాపర్టీ టాక్స్ కు సంబంధించి మార్పులు ఉంటాయని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.

చాలా సమస్యలకు పరిష్కారం..

1961లో చేసిన బిల్లలో 30 శాతం తగ్గింపును ఉంటే దాన్ని ఎప్పుడు క్లయిమ్ చేయాలో స్పష్టంగా వివరించలేదు. ఇప్పుడు చేసిన బిల్లులో దాన్ని మార్చారు. ఆదాయపు పన్ను ట్టం 1961లో 23, 24 సెక్షన్లను మరింత స్పష్టంగా చెప్పాలి. నిర్మాణానికి సంబంధించిన వడ్డీ (ఇల్లు నిర్మించే ముందు చెల్లించే రుణానికి సంబంధించిన వడ్డీ) కోసం మినహాయింపు ఉంటుంది. ఇది సొంత ఇంటికి అయినా లేదా అద్దె ఇంటికైనా వర్తిస్తుంది. నిరుపయోగంగా ఉన్నా.. చాలా కాలం ఖాళీగా ఉన్న వ్యాపార ఆస్తులపై ఎలాంటి పన్ను ఉండదు. ఇంటి నుంచి వచ్చే ఆదాయం వృత్తి పరంగా ఉపయోగిస్తేనే పన్ను ఉంటుందని క్లాజ్ 20 చెప్తుంది. ఇక పోతే పన్ను స్లాబ్ విధానంలో ఎలాంటి మార్పు లేదు. గతంలో లాగానే ఇప్పుడు కూడా ఉంది.

సాధారణ ప్రజలకు అర్థం అయ్యే రీతిలో..

ఇక పన్ను వివరాలను నియమాలను సాధారణ ప్రజలకు సైతం అర్థం అయ్యేలా వారికి అనుకూలమైన భాషలో వివరిస్తారు. ఈ కొత్త విధానంలో అసెస్ మెంట్ ఇయర్ లేదంటే లాస్ట్ ఇయర్ స్థానంలో ట్యాక్స్ ఇయర్ ను పరిగణలోకి తీసుకుంటారు. దీని ద్వారా పన్ను చెల్లించేవారు ఐటీఆర్ దాఖలు చేసేప్పుడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉంటుంది. గడువు పూర్తయిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే వాపస్ పొందడంలో ఎలాంటి సమస్య ఉండదు.