Begin typing your search above and press return to search.

ఖైదీలకు ఓటు హక్కు లేదా ?

పీడీ యాక్ట్ కింద అరెస్టయి జైలులో ఉన్న సుమారు 70 మందికి మాత్రమే ఓట్లు వేసే హక్కుందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

By:  Tupaki Desk   |   29 Nov 2023 4:30 PM GMT
ఖైదీలకు ఓటు హక్కు లేదా ?
X

ఎన్నికల్లో ఓట్లు వేయటం అన్నది ప్రతి ఒక్కరి హక్కు. ఈ విషయం భారత రాజ్యాంగం కూడా స్పష్టంగా చెబుతుంది. ఏ కారణంతో కూడా ఓటు వేసే అవకాశాన్ని ఎవరికీ నిరాకరించకూడదు. అయితే ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ఖైదీలకు ఓటు హక్కు లేదట. నవంబర్ 30వ తేదీన జరగబోయే తెలంగాణా ఎన్నికల్లో ఖైదీలు ఓటు వేసే హక్కును కోల్పోయారు. పీడీ యాక్ట్ కింద అరెస్టయి జైలులో ఉన్న వాళ్ళకి తప్ప ఇంకెవరికీ ఓట్లు వేసే హక్కులేకపోవటమే విచిత్రంగా ఉంది.

సెంట్రల్ జైళ్ళు, జిల్లా, సబ్ జైళ్ళు కలపి తెలంగాణా మొత్తంమీద 37 జైళ్ళున్నాయి. అన్నీ జైళ్ళల్లో కలిపి సుమారు 8 వేలమందికిపైగా ఖైదీలున్నారు. వీరిలో నేరారోపణలు ఎదుర్కొని కోర్టుల్లో విచారణ పూర్తయి శిక్షలు పడిన వారున్నారు. అలాగే వివిధ నేరారోపణలపై విచారణను ఎదుర్కొంటున్న ఖైదీలు కూడా ఉన్నారు. చట్ట ప్రకారం వీళ్ళెవరికీ ఓట్లువేసే హక్కులేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పీడీ యాక్ట్ కింద అరెస్టయి జైలులో ఉన్న సుమారు 70 మందికి మాత్రమే ఓట్లు వేసే హక్కుందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

పీడీ యాక్ట్ కింద అరెస్టయి జైలులో ఉన్న వాళ్ళకోసం పోస్టల్ బ్యాలెట్ తెప్పిస్తున్నట్లు ప్రభుత్వవర్గాలు చెప్పాయి. అవసరమైతే పోలింగ్ కేంద్రం కూడా జైలులో ఏర్పాటుచేయించే వెసులుబాటు ఉందన్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే నేరాలు చేసి జైలులో ఉన్న వాళ్ళకి ఓట్లు వేసే హక్కులేదట కానీ నేరస్తులు పోటీ మాత్రం చేయచ్చట. ఓటు వేసే హక్కు లేని వ్యక్తులు మరి పోటీ చేసే హక్కును మాత్రం ఎలా వినియోగంచగులుతున్నట్లు ? ఇపుడు జరుగుతున్న ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున పోటీచేస్తున్న వారిలో 230 మందిపైన తీవ్ర నేరారోపణలున్నాయి.

పోటీచేయాలంటే ముందు ఓటుండాలి, వాళ్ళ నామినేషన్ పై పదిమంది ప్రపోజ్ చేస్తు సంతకాలు పెట్టాలి కదా. పదిమంది ప్రపోజ్ చేస్తేనే కదా వాళ్ళ నామినేషన్ ఆమోదం పొందేది ? అసలు ఓటు హక్కేలేని నేరస్తుడు ఎన్నికల్లో ఎలా పోటీచయగలడు ? జైల్లో కూర్చుని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్రాల్లో కొందరు నేరస్తులు పోటీచేయటమే కాదు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటపుడు తెలంగాణా జైళ్ళల్లో ఉన్న ఖైదీలకు ఓటు హక్కు కల్పిస్తే తప్పేమిటి ?