Begin typing your search above and press return to search.

బ్రిటన్ ప్రధాని సునాక్ ఇంటిపై నల్ల వస్త్రాన్ని కప్పేశారు

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇంటి మీద నిరసనకారులు నల్లటి వస్త్రాన్ని కప్పేసిన ఉదంతం షాకింగ్ గా మారింది

By:  Tupaki Desk   |   4 Aug 2023 5:25 AM GMT
బ్రిటన్ ప్రధాని సునాక్ ఇంటిపై నల్ల వస్త్రాన్ని కప్పేశారు
X

విన్నంతనే షాక్ తగిలేలా ఉంటుందీ ఉదంతం. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇంటి మీద నిరసనకారులు నల్లటి వస్త్రాన్ని కప్పేసిన ఉదంతం షాకింగ్ గా మారింది. ఇంగ్లాండ్ లోని నార్త్ యార్క్ షైర్ ప్రాంతంలోని రిచ్ మండ్ లో ఉన్న రిషి సునాక్ ఇంటిని భారీ నల్లటి వస్త్రంతో కప్పేసిన ఉదంతం చూస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. అయితే.. ఈ నిరసన కార్యక్రమం జరిగిన వేళలో.. సునాక్ ఇంట్లో ఎవరూ లేకపోవటం గమనార్హం.

ఈ అనూహ్య చర్యను గ్రీన్ పీస్ కార్యకర్తలు చేశారు. సముద్రంలో చమురు.. గ్యాస్ వెలికితీతకు సంబంధించి తాజాగా సునాక్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గ్యాస్ వెలికితీతను మరింత విస్తరించేలా సునాక్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దాదాపు 200 చదరపు మీటర్లు ఉన్న ఈ నల్లటి వస్త్రాన్ని కప్పేయటం.. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఈ చర్యకు పాల్పడిన గ్రీన్ పీస్ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరో ఉదంతంలో ఇదే సంస్థకు చెందిన మరో ఇద్దరు కార్యకర్తలు సునాక్ ఇంటి ముందు ఒక ప్లకార్డును పట్టుకున్నారు. మీకు చమురు లాభాలు ముఖ్యమా? మా భవిష్యత్తు ముఖ్యమా? అంటూ తమ నిరసనను తెలియజేశారు. సునాక్ ఇంటిని భారీ నల్లటి వస్త్రంతో కప్పేసిన వేళలో.. సునాక్ కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. అయితే.. దేశ ప్రధాని ఇంటి వద్ద ఉండాల్సిన సెక్యురిటీ సంగతేమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఏమైనా.. నిరసనకారులు దేశ ప్రధానికి చెందిన ఇంటికి వెళ్లి.. అక్కడ నల్ల వస్త్రాన్ని కప్పే వరకు నిఘా వర్గాలు ఏం చేస్తున్నట్లు? అన్నది మరో క్వశ్చన్.