Begin typing your search above and press return to search.

చెట్లు స‌రే.. మానవ‌త్వం నాటాలి: మోడీపై నెటిజ‌న్ల కామెంట్లు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై నెటిజ‌న్లు మ‌రోసారి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌తి నెలా చివ‌రి ఆదివారం ఆయ‌న నిర్వ‌హించే మ‌న్‌కీ బాత్ ఈ రోజు(ఆదివారం-30-07)న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి రేడియోలో 30 నిమిషాల పాటు మాట్లాడారు.

By:  Tupaki Desk   |   30 July 2023 11:24 AM GMT
చెట్లు స‌రే.. మానవ‌త్వం నాటాలి:  మోడీపై నెటిజ‌న్ల కామెంట్లు
X

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై నెటిజ‌న్లు మ‌రోసారి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌తి నెలా చివ‌రి ఆదివారం ఆయ‌న నిర్వ‌హించే మ‌న్‌కీ బాత్ ఈ రోజు(ఆదివారం-30-07)న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి రేడియోలో 30 నిమిషాల పాటు మాట్లాడారు. ఇది ప్ర‌తిసారీ జ‌రిగే కార్య‌క్ర‌మమే అయినా.. ఈ సారి చాలా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఎందుకంటే.. ఈ ప‌ది రోజుల వ్య‌వ‌ధిలోనే మ‌ణిపూర్‌లో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా ఊరేగిస్తూ.. తీసేకువెళ్లి అత్యాచారం చేయ‌డం..దేశాన్నికుదిపేసింది.

అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాలు ఇండియా పేరుతో ఏర్ప‌డి స‌ర్కారుపై అవిశ్వాసం ప్ర‌క‌టించాయి. ఇంకోవైపు.. ఉమ్మ‌డి పౌర‌స్మృతి విష‌యం దేశంలో కాక రేపుతోంది. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ట‌మాటాల ధ‌ర‌లు ఆకాశాన్నం టుతున్నాయి. బియ్యం ధ‌ర‌లు కూడా పెరిగే సూచ‌న‌లు ఉన్నాయి. ఇంకోవైపు.. ఆర్థిక వ్య‌వ‌స్థ ఏమంత బాగాలేద‌ని.. తాజాగా ప్ర‌పంచ బ్యాంకు భార‌త్‌ను హెచ్చ‌రించింది. మ‌రి ఇన్ని స‌మ‌స్య‌లు ఉన్నాయి. కానీ, వీటిలో ఏ ఒక్క అంశాన్ని కూడా ప్ర‌ధాన మంత్రి స్పృశించ‌లేదు.

పైగా ఆయ‌న‌.. మొక్క‌లు నాటండి.. అని పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల గొప్ప‌త‌నాన్నితెర‌మీదికి తెచ్చి.. శ్వొత్క‌ర్ష‌లు గుప్పించారు. జమ్ము కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్న మంచిని ప్ర‌స్తావించారు.

ఒక్క ఉత్తర్ ప్రదేశ్ లోనే ౩౦ కోట్ల చెట్లను నాటడానికి అక్కడి ప్రభుత్వం ముందుకొచ్చిందని ప్రధాన మం త్రి తెలిపారు. అదేస‌మ‌యంలో 2500 సంవత్సరాల పురాతన విగ్రహాలను అమెరికా నుంచీ తిరిగి తెస్తున్నా మని మోడీ తెలిపారు. మధ్యప్రదేశ్ లోని విచార్ పూర్ అనే గిరిజన గ్రామాన్ని మినీ బ్రెజిల్ అని అంటారంటూ గొప్ప‌లు చెప్పారు.

నెటిజ‌న్ల కామెంట్లు ఇవే..


ప్ర‌ధాన మంత్రి మ‌న్‌కీ బాత్ విష‌యంపై నెటిజ‌న్లు స్పందించారు. అయితే.. ప్ర‌ధాన మంత్రి చెప్పిన విష యాల‌పై నిశిత విమ‌ర్శ‌లు గుప్పించారు. మొక్క‌లు నాటడం స‌రే.. మోడీ జీ.. మణిపూర్‌లో మాన‌వ‌త్వం నాటండి! అని మెజారిటీ నెటిజ‌న్లు వ్యాఖ్యానించారు. మ‌రికొంద‌రు.. నిత్యావ‌స‌ర వ‌స్తువుల గురించి క‌నీసం ప్ర‌స్తావించ‌క‌పోవ‌డాన్ని కూడా ఎక్కువ మంది విమ‌ర్శించారు. రాబోయే రోజుల్లో వ‌ర్షాల కార‌ణంగా ఉల్లిపాయ‌లు కూడా దొరికే అవ‌కాశం లేద‌ని.. వాటి గురించి జాగ్ర‌త్త‌ల‌పై ఏదైనా చ‌ర్చిస్తే బాగుండేద‌ని కొంద‌రు చెప్పారు. మ‌రికొంద‌రు.. మీ మ‌న‌సులో మాట కాదు.. ప్ర‌జ‌లు ఏమ‌న‌కుంటున్నారో తెలుసుకోండి స‌ర్‌! అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మ‌ణిపూర్ ఘ‌ట‌న సిగ్గు ప‌డాల్సింద‌ని చెప్పుకొన్న ప్ర‌ధాని.. దానిని కూడా ప్ర‌స్తావించ‌లేద‌ని మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు.