Begin typing your search above and press return to search.

9 ఏళ్ల పాల‌న‌లో.. ఏ వ‌ర్గానికి మోడీ చేరువ‌?

దేశాన్ని 9 ఏళ్లు వ‌రుస‌గా(ఇప్ప‌టి వ‌ర‌కు) పాలించిన ఏకైక బీజేపీ నాయ‌కుడు, ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న వ్య‌క్తి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఒక్క‌రే. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు.

By:  Tupaki Desk   |   23 July 2023 7:26 AM GMT
9 ఏళ్ల పాల‌న‌లో.. ఏ వ‌ర్గానికి మోడీ చేరువ‌?
X

దేశాన్ని 9 ఏళ్లు వ‌రుస‌గా(ఇప్ప‌టి వ‌ర‌కు) పాలించిన ఏకైక బీజేపీ నాయ‌కుడు, ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న వ్య‌క్తి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఒక్క‌రే. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకున్న వాజ‌పేయి కూడా ఇంత కీర్తిని సొంతం చేసుకోలేక పోయారు. అలాంటి మోడీ.. ఈ 9 ఏళ్ల కాలంలో ఏ వ‌ర్గానికి చేరువ‌య్యారు.? ఇప్పుడు ఎందుకు విల‌న్ అవుతున్నారు? అనేది చ‌ర్చగా మారింది.

ఆది నుంచి కూడా.. మోడీ వ‌ర్గంలోని నాయ‌కుల‌ను ప‌రిశీలిస్తే.. వారు హిందూత్వ అజెండాను త‌ర‌చుగా చెబుతూ వ‌చ్చారు. క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ విష‌యం స్ప‌ష్టంగా బ‌హిర్గతం అయిపో యింది. ఓటు వేసి, బ‌య‌ట‌కు వ‌చ్చాక జై బ‌జ‌రంగ‌బ‌లీ నినాదం ఇవ్వాల‌ని మోడీ స్వ‌యంగా పిలుపు నిచ్చిన ద‌రిమిలా.. మోడీ ఏ వ‌ర్గ‌మో.. చెప్ప‌క‌నే చెప్పారు. అక్క‌డే కాదు.. ఇత‌ర ఎన్నిక‌లు జ‌రిగిన రాష్ట్రాల్లోనూ ఆయ‌న హిందూ వ‌ర్గం కేంద్రంగా రాజ‌కీయాలకు ప‌దును పెట్టారు.

అంటే మొత్తంగా మోదీ హిందు వ‌ర్గానికి చేరువ అయ్యార‌నే వాద‌న‌ను బీజేపీ చెబుతుండ‌వ‌చ్చు. కానీ, ఇప్పుడు ఇదే వ‌ర్గంలో త‌లెత్తిన అసంతృప్తి, అస‌మ్మ‌తి.. చాప‌కింద నీరులా.. మోడీకి సెగ పెడుతోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ``దేశం అంటే.. కేవ‌లం హిందువులు మాత్ర‌మే కాదు. అన్ని వ‌ర్గాల స‌మాహారం. ఇదెలా ఉన్నా.. హిందువుల సైతం జీవితం స‌జావుగా గ‌డ‌పాలంటే.. అన్ని కూడా స‌మ పాళ్లలో వారికి చేరాలి. ఈ విష‌యంలో కేంద్రం విఫ‌ల‌మ‌వుతోంది`` అని ఆర్ ఎస్ ఎస్ నాయ‌కులు సైతం ఇటీవ‌ల వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు.. క‌రోనా స‌మ‌యంలో పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల ఆదాయం కునారిల్లిపోయి.. నానా క‌ష్టాలు ప‌డితే.. ఉన్న‌త వ‌ర్గాల్లోని వ్యాపారులు అదానీ అంబానీ వంటివారు.. కోట్ల‌కు కోట్లు సంపాయించుకున్నా ర‌న్న కేంద్ర నివేదిక‌లు.. మోడీ వ్యాపార వ‌ర్గాల‌కు అనుకూల‌మనే మాట‌ను స్ప‌ష్టం చేసింది. అంటే.. ఇత‌మిత్థంగా చూస్తే.. ఇప్పుడు మోడీ తను భావిస్తున్న‌ట్టు ఇటు హిందుల‌కు అయితే.. చేరువ కాలేక పోయార‌నేది స‌త్య‌మ‌ని చెబుతున్నారు.

సో.. కాబ‌ట్టి.. మోడీ.. ప‌రిస్థితి ఒకింత డోలాయ‌మానంలోనే ఉంద‌ని అంటున్నారు. మ‌రో 9 నెల‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో మ‌ణిపూర్‌లో హిందువుల ప‌క్షాన నిల‌బ‌డిన ఫ‌లితం త‌ద్వారా త‌లెత్తిన అల్ల‌ర్లు.. అమాన‌వీయాలు.. మోడీ పీఠానికి ఎస‌రు పెడ‌తాయో.. మ‌రోసారి ఆయ‌న‌నే గద్దెనెక్కిస్తాయో చూడాలని అంటున్నారు ప‌రిశీల‌కులు.