Begin typing your search above and press return to search.

ప్రీవెడ్డింగ్ కోసం జామ్ నగ‌ర్ ఎందుకంటే?

అప‌ర కుబేరుడు ముకేష్ అంబానీ చిన్న కుమార్ అనంత్ అంబానీ -రాధికా మ‌ర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల‌కు జామ్ న‌గ‌ర్ ముస్తాబ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Feb 2024 10:30 AM GMT
ప్రీవెడ్డింగ్ కోసం జామ్ నగ‌ర్ ఎందుకంటే?
X

అప‌ర కుబేరుడు ముకేష్ అంబానీ చిన్న కుమార్ అనంత్ అంబానీ -రాధికా మ‌ర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల‌కు జామ్ న‌గ‌ర్ ముస్తాబ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. వేదిక‌ని ఎంతో అందంగా అల‌కంరిస్తున్నారు. అందు కోసం కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నారు. ప్ర‌పంచ‌మే ఈ వెడ్డింగ్ గురించి మాట్లాడుకునేలా ఉండాల‌ని ప్ర‌త్యేకంగా ముస్తాబు చేస్తున్నారు. వివిధ దేశాల నుంచి ప్ర‌త్యేక‌మైన పువ్వులు తెప్పించి డెక‌రేట్ చేస్తున్నారు.

ఆ పువ్వుల ప‌రిమ‌ణానికి జామ్ న‌గ‌ర్ అంతా గుభాళించేలా చేస్తున్నారు. మార్చి 1 నుంచి 3వతేదీ వ‌ర‌కూ ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. మొత్తం 1000 మంది ప్ర‌ముఖులు ఈ మూడు రోజుల వేడుక‌లో పాల్గొంటారు. దాదాపు 2500 ర‌కాల వంట‌కాల‌తో మెనూ సిద్ద‌మ‌వుతోంది. మ‌రి జామ్ న‌గ‌ర్ ప్ర‌త్యేక‌త ఏంటి? ఇండియాలో అన్ని న‌గ‌రాలు ఉండ‌గా జామ్ న‌గ‌ర్ నే అంబానీ ఫ్యామిలీ ఎందుకు ఎంచుకుంది? అంటే చాలా సంగ‌తులే ఉన్నాయ‌ని తెలుస్తోంది.

అనంత్ అంబానీ అమ్మ‌మ్మ ది జామ్ న‌గ‌ర్. ఈ న‌గ‌రాన్ని ఆమె సుంద‌ర న‌గ‌రంగా తీర్చి దిద్దార‌ని... ఇటుక ఇటుక పేర్చి తీర్చి దిద్ద‌డంతోనే న‌గ‌రం ఇంత అందంగా ఉంటుంద‌ని అన్నారు. చిన్న‌ప్పుడు అదే న‌గ‌రంలో చాలా స‌మ‌యం గ‌డిపిన‌ట్లు తెలిపాడు. అక్క‌డ ప్ర‌త్యేక‌మైన స్నేహితులు కూడా ఎందరో ఉన్నార‌ని..ముంబై క‌న్నా ఆ న‌గ‌రమంటే త‌న‌కెంతో ప్ర‌త్య‌మ‌ని అంటున్నాడు.

ముంబైలో ఉంటున్నా..త‌న మ‌న‌సంతా జామ్ నగ‌ర్ జ్ఞాప‌కాల్లోనే ఉంటుంద‌ని అన్నాడు. అలాగే అమ్మ‌మ్మ కూడా ప్రీ వెడ్డింగ్ వేడుక అక్క‌డే నిర్వాహించాల‌ని కోరారుట‌. అందుకే జామ్ న‌గ‌ర్ లో వేడుక‌లు నిర్వ‌హిస్తు న్న‌ట్లు తెలిపాడు. చిన్నప్పుడు కలిసి తిరిగిన స్నేహితులు.. బంధువులతో కలిసి ఇప్పుడు వేడుకలు జరుపుకోబోతున్నామని అనంత్ అంబానీ సంతోషం వ్య‌క్తం చేసాడు.