Begin typing your search above and press return to search.

శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడు.. ఆదాయం ఇంత తక్కువా?

మరోవైపు తమ పొరుగు దేశం ఉక్రెయిన్‌.. అమెరికా కూటమి అయిన నాటోలో చేరడానికి మొగ్గుచూపడంతో ఉక్రెయిన్‌ పై పుతిన్‌ యుద్ధం మొదలుపెట్టారు.

By:  Tupaki Desk   |   1 Feb 2024 10:30 AM GMT
శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడు.. ఆదాయం ఇంత తక్కువా?
X

ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాధినేతల్లో ఒకరు.. వ్లాదిమిర్‌ పుతిన్‌. గతంలో రష్యా అధ్యక్షుడిగా, ప్రధానిగా, మళ్లీ ఇప్పుడు అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. గత ఆరేళ్లుగా దేశాధినేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు తమ పొరుగు దేశం ఉక్రెయిన్‌.. అమెరికా కూటమి అయిన నాటోలో చేరడానికి మొగ్గుచూపడంతో ఉక్రెయిన్‌ పై పుతిన్‌ యుద్ధం మొదలుపెట్టారు. దాదాపు రెండేళ్లుగా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది.


ఈ నేపథ్యంలో తరచూ అంతర్జాతీయ మీడియాలో వ్లాదిమిర్‌ పుతిన్‌ కు సంబంధించిన ప్రతి విషయం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. తాజాగా ప్రపంచంలో అపర కోటేశ్వరుడు ఎలాన్‌ మస్క్‌ తన కంటే రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతినే అత్యధిక ధనవంతుడని బాంబుపేల్చిన సంగతి తెలిసిందే.

అలాగే రష్యా మీడియా సంస్థ.. పుతిన్‌ కు రష్యా–ఫిన్లాండ్‌ సరిహద్దులో రహస్య భవనం ఉందని సంచలన కథనం ప్రచురించింది. ఎన్నో అత్యాధునిక సౌకర్యాలు, హంగులు, పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఉన్న ఈ రహస్య భవనం ఫిన్లాండ్‌ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో రిపబ్లిక్‌ ఆఫ్‌ కరెలీనాలో ఉందని తెలిపింది.

ఈ నేపథ్యంలో వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆస్తులు, ఆదాయంపై చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించి అంశాలు తాజాగా తెరమీదకొచ్చాయి. ఈ ఏడాది మార్చిలో రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్‌ ఆదాయ, అప్పులు వివరాలను స్వయంగా ఆయనే పేర్కొన్నారు.

ఈ మేరకు అఫిడవిట్‌ లో తన ఆదాయ, అప్పుల వివరాలను పుతిన్‌ పొందుపరిచారు. తాజాగా ఆయన అఫిడవిట్‌ వివరాలను రష్యా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ లో పొందుపరిచింది.

గత ఆరేళ్ల నుంచి రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్న తన ఆస్తుల విలువ 67.6 మిలియన్‌ రూబుల్స్‌ (7,53,000 అమెరికన్‌ డాలర్లు) అని పుతిన్‌ తన అఫిడవిట్‌ లో పేర్కొన్నారు. ఈ మొత్తం బ్యాంక్‌ డిపాజిట్లు, మిలిటరీ పెన్షన్, పలు స్థలాల అమ్మకం ద్వారా లభించిన మొత్తమని సమాచారం.

67.6 మిలియన్‌ రూబుల్స్‌ను తాను 2018 నుంచి 2024 వరక సంపాదించినట్టు పుతిన్‌ ఎన్నికల అఫిడవిట్‌ లో పేర్కొన్నారు. కాగా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా పేరొందిన అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనం 4,00,000 అమెరికన్‌ డాలర్లు. ఈ లెక్క ప్రకారం.. రష్యా అధ్యక్షుడి వార్షిక ఆదాయం అమెరికా అధ్యక్షుడితో పోల్చుకుంటే చాలా తక్కువేనని చెబుతున్నారు.

రష్యా కేంద్ర ఎన్నికల సంఘం వివరాల ప్రకారం.. రష్యా అధినేత పుతిన్‌ పది వేర్వేరు బ్యాంక్‌ ఖాతాల్లో 54.5 మిలియన్‌ రూబుల్స్‌ ( 606,000 అమెరికన్‌ డాలర్లు) నగదు కలిగి ఉన్నారు. ఆయన ఐదు సొంత వాహనాలు కలిగి ఉన్నారు. అలాగే పుతిన్‌ కు దేశ రాజధాని మాస్కోలో ఒక అపార్టుమెంట్‌ ఉంది. రష్యాలో ప్రధాన నగరాల్లో ఒకటైన సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ లో ఒక అపార్టుమెంట్, గ్యారేజ్‌ కూడా ఉన్నాయి.

కాగా రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చి 15 నుండి 17 వరకు మూడు రోజులపాటు జరగనున్నాయి. 2020లో వివాదాస్పద రాజ్యాంగ సంస్కరణను అనుసరించి పుతిన్‌(71) కనీసం 2036 వరకు అధికారంలో కొనసాగే అవకాశం ఉందని