Begin typing your search above and press return to search.

ప్రీ పోల్ ఎగ్జిట్ పోల్ సర్వేలు తప్పు అవుతున్నాయా...?

ఈ ట్రెండ్ ఏంటి అంటే ఎన్నికల ముందే జనాల మైండ్ సెట్ ని మార్చేసే విధంగా అనుకూల సర్వేలు కుప్పలు తెప్పలుగా వదలడం.

By:  Tupaki Desk   |   14 March 2024 9:28 AM GMT
ప్రీ పోల్ ఎగ్జిట్ పోల్ సర్వేలు తప్పు అవుతున్నాయా...?
X

దేశంలో చాలా కాలం నుంచి ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. బహుశా ఈ తరహా సరళి మొదలై ఒక దశాబ్దం కావచ్చు అని అంచనా. ఈ ట్రెండ్ ఏంటి అంటే ఎన్నికల ముందే జనాల మైండ్ సెట్ ని మార్చేసే విధంగా అనుకూల సర్వేలు కుప్పలు తెప్పలుగా వదలడం. ఫలానా పార్టీ గెలిచేస్తోంది అన్న ఫీలింగ్ ని జనాలకు ఇవ్వడం.

అయితే ఇది మొదట్లో హిట్ అయింది కానీ రాను రానూ ఈ పోకడలను జనాలు గమనిస్తున్నారు. తమదైన తీర్పులో ఈ పోల్ సర్వేలను తిప్పి కొడుతున్నారు. అందుకే చాలా చోట్ల ప్రీ పోల్ ఎగ్జిట్ పోల్ సర్వేలు తప్పు అవుతున్నాడని అంటున్నారు. దీనికి ఎన్నో ఉదాహరణలు కళ్ల ముందు ఉన్నాయి.

ఇటీవల తెలంగాణా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే ప్రముఖ సంస్థల నుంచి చాలా ఇతర సంస్థలు అన్నీ కూడా గమనిస్తే ఎవరూ కూడా కరెక్ట్ గా జనం నాడి పట్టుకోలేదు అనిపిస్తుంది. ఎవరు కూడా సరైన రిపోర్ట్ ని ఇవ్వలేదు అని అంటున్నారు.

అంతా కూడా ఏకంగా పది సీట్లు తేడా పెట్టి మరీ సర్వే నివేదికలను ఇచ్చారు. అది ఓకే అనుకున్నా తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు సరిపడా కూడా సీట్లు ఇవ్వలేదు. తెలంగాణాలో ఒక ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే అరవై సీట్లు అవసరం.

ఇలా ప్రీ పోల్ సర్వేలు ఎగ్జిట్ పోల్ సర్వేలు ఉన్నాయని చెప్పక తప్పదు. కొన్ని సంస్థలు ఏకంగా ఎనభై దాకా కాంగ్రెస్ వస్తాయని అంచనా కట్టి బొక్క బోర్లా పడితే మరి కొన్ని బీఆర్ఎస్ కి 30 సీట్ల కంటే దాటవని చెప్పి తప్పుడు అంచనా వేశాయి. మరి కొన్ని సర్వేలు చూస్తే బీఆర్ స్ కి ఏకంగా యాభై సీట్ల దాకా కట్టబెట్టి అదే కాంగ్రెస్ కి మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగా 58 వస్తాయన వెల్లడించాయి.

ఇంకొన్ని సంస్థలు కాంగ్రెస్ కి 72 అంటూ వచ్చాయి. అదే టైం లో బీఆర్ఎస్ కి ఏకంగా 51 దాకా ఇచ్చేశాయి. ఇంకొన్ని సర్వేలు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకుండా హంగ్ అసెంబ్లీని సూచించాయి. అపుడు కూడా బీఆర్ఎస్ కి 48 సీట్లు ఇస్తూ కాంగ్రెస్ కి 50 పైన అన్నట్లుగా నంబర్లు వేశాయి.

ఇక ఇవే సంస్థలు బీజేపీకి డబుల్ డిజిట్ కూడా ఇచ్చేశాయి. 10 దాకా బీజేపీకి వస్తాయని చెప్పిన సంస్థలు ఉన్నాయి. అలాగే ఇతరుల కోటాలో 9 దాకా సీట్లు కట్టబెట్టేసిన నేపధ్యం ఉంది. వీటిని చూసినపుడు ఈ సర్వేలకు ప్రామాణికం ఏమిటి అన్న చర్చ సాగుతోంది.

ఇక ప్రీ పోల్ సర్వేల మీద రాజకీయ పార్టీల ప్రభావం ఉంటుంది అని అంతా అనుమానిస్తారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు అయితే ఓటరు పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చి చెప్పే తీర్పుని కూడా క్రోడీకరించి సర్వే నివేదికలు తయారు చేయడంలో కూడా తప్పులు ఎక్కడ వస్తున్నాయని చర్చ సాగుతోంది.

ఏది ఏమైనా తామర తంపరగా సర్వేలు వచ్చి పడుతున్నాయి. అదే టైం లో జనాలలో అంతకంతకు విశ్వాసం తగ్గిపోతోంది. ఏ సర్వేను నమ్మాలో తెలియడంలేదు అని సగటు జనం అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఓటరుని మించిన సర్వేశ్వరుడు లేడు అని అంటున్నారు. అందువల్ల గతంలో మాదిరిగా సర్వేలను చూసి మోసపోవడాని ఓటరు రెడీగా లేరు అని అంటున్నారు. అందువల్లనే సర్వేలు ఇపుడు ఎన్ని వస్తున్నా సంచలనాలుగా మాత్రం మార్చలేకపోతున్నాయి అంటున్నారు.