Begin typing your search above and press return to search.

సంచలనం : ప్రెగ్నెంట్ జాబ్ స్కామ్!

అప్పట్లో అయితే నేరుగా ఏజెంట్ల ద్వారా మోసానికి పాల్పడేవారు

By:  Tupaki Desk   |   1 Jan 2024 11:32 AM GMT
సంచలనం : ప్రెగ్నెంట్ జాబ్ స్కామ్!
X

టెక్నాలజీ బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడంతా సులువుగా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో పుట్టుకొచ్చినవే ఆన్ లైన్ మోసాలు.. సేవింగ్స్ ఖాతా, క్రెడిట్ డెబిట్ కార్డులు బ్లాక్ అయ్యాయని.. కొంత మొత్తం చెల్లిస్తే యాక్టివేట్ చేస్తామని డబ్బు కాజేయడం, ఏవేవో లింకులు పంపి ఖాతాను ఊడ్చేయడం ఇలాంటివే. ఇక ఉద్యోగ మోసాలు గతంలోనూ ఉన్నవే. అప్పట్లో అయితే నేరుగా ఏజెంట్ల ద్వారా మోసానికి పాల్పడేవారు. ఇప్పుడు మెయిల్స్ చేసి వివరాలు తీసుకుని డబ్బు కాజేస్తున్నారు.

బిహారు.. బిమారు

ఇప్పుడంటే కాస్త వెనకాముందు ఆలోచిస్తారు కానీ.. బిహార్ అంటే కొన్నాళ్ల కిందట బిమారు (పేద) రాష్ట్రంగా చెప్పేవారు. అక్కడి ప్రజల జీవన స్థితిగతులు, చిన్నచిన్న పనుల కోసం రాష్ట్రాలు దాటి వెళ్లడం వల్ల ఈ పేరు వచ్చింది. బిహారీలు ముంబై స్థానికుల పొట్టకొడుతున్నారంటూ కొన్నాళ్ల కిందట పెద్ద ఉద్యమమే నడిచింది. ఇక బిహార్ కూలీలు ఇప్పటికీ ప్రతి రాష్ట్రంలోనూ ఉండడం గమనార్హం.

ఇదో చిత్రం..

డబ్బులు చెల్లిస్తే ఉద్యోగం ఇస్తానని చెప్పి వంచించడం ఒక రకమైతే.. దానికి మించిన ఉదంతం బిహార్ లో వెలుగులోకి వచ్చింది. భాగ‌స్వాముల ద్వారా గ‌ర్భం దాల్చ‌ని వారిని త‌ల్లిని చేస్తే పెద్ద‌మొత్తంలో డ‌బ్బు ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేస్తూ పెద్ద‌మొత్తంలో దోచుకున్న వైనం బయటపడింది. దీనికోసం సోష‌ల్ మీడియా వేదిక‌ల ద్వారా ఆలిండియా ప్రెగ్నెంట్ జాబ్ (బేబీ బ‌ర్త్ స‌ర్వీస్‌) పేరుతో ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇవ్వడం గమనార్హం. దీనిని చూసి ముందుకొచ్చినవారి నుంచి రిజిస్ట్రేష‌న్ ఫీజు కింద రూ.799 వ‌సూలు చేస్తున్నారు. ఆపై సెక్యూరిటీ మ‌నీ పేరుతో రూ.5 వేల నుంచి రూ.20 వేలు గుంజారు. దీనంతటికీ ప్ర‌ధాన సూత్ర‌ధారి మున్నా కుమార్. అతడి నివాసంపై దాడుల అనంత‌రం బిహార్ పోలీసులు ఇతర ముఠా స‌భ్యుల‌ను న‌వాడాలో అరెస్ట్ చేశారు. మొత్తం 8 మంది స‌భ్యుల‌ను అదుపులోకి తీసుకున్నారు. 9 స్మార్ట్‌ఫోన్లు, ఓ ప్రింట‌ర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

దేశవ్యాప్తంగా సైబర్ సిండికేట్..

నిందితులు దేశ‌వ్యాప్తంగా సైబ‌ర్ సిండికేట్‌ గా ఏర్ప‌డి దందాకు తెర‌లేపడం గమనార్హం. ఈ గ్రూప్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ ఫాంలలో 'ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ (బేబీ బర్త్ సర్వీస్)'గా పనిచేస్తోంది. ఉద్యోగ సేవలో పాల్గొనమంటూ పురుషులను ఆకర్షించి.. బిడ్డను కనలేని స్త్రీలను గర్భవతులను చేస్తే రూ.13 లక్షలు పొందవచ్చని ప్రకటించింది. ఫేస్‌ బుక్ , వాట్సాప్ లో పురుషుల నమోదు తర్వాత, సమూహం ఎంపిక కోసం వివిధ అమ్మాయిలు ఫోటోలు పంపేవారు. కాగా, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దాడిలో మున్నా కుమార్‌ తప్పించుకున్నాడు. త్వరలో మరికొందరిని అరెస్టు చేసే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు.