Begin typing your search above and press return to search.

ఉత్తరాఖండ్‌ లో టన్నెల్‌ నిపుణుడి ప్రార్ధనలు... వీడియో వైరల్!

ఈ క్రమంలో సిల్క్యారా టన్నెల్‌ కూలిన ఘటనలో బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు అలుపెరుగని ప్రయత్నాలు చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   24 Nov 2023 9:45 AM GMT
ఉత్తరాఖండ్‌  లో టన్నెల్‌  నిపుణుడి ప్రార్ధనలు... వీడియో వైరల్!
X

ఉత్తరాఖండ్‌ లో టన్నెల్‌ కూలిన ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సుమారు గత 13 రోజులుగా శిథిలాల కిందే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిల్క్యారా టన్నెల్‌ కూలిన ఘటనలో బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు అలుపెరుగని ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో మరి కొన్ని గంటల్లో 41 మందిని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

అయితే సుమారు రెండు వారాలుగా శిధిలాల కిందే బిక్కు బిక్కు మంటూ ఉన్నవారిని బయటకు తెచ్చిన తక్షణమే వైద్య సహాయం అందించేందుకు ఘటనా స్థలంలో అంబులెన్సులు, ప్రత్యేక పడకల టెంపరరీ ఆస్పత్రి, మందులు, ఆక్సిజన్‌ కిట్లు అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితి నిమిత్తం ఒక హెలీకాప్టర్ ను కూడా అందుబాటులో ఉంచారని తెలుస్తుంది.

ప్రస్తుతం టన్నెల్ కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా... పెద్ద పైపు ద్వారా చక్రాలు కలిగిన స్ట్రేచర్‌ ను కార్మికుల వద్దకు చేర్చి.. ఒకరి తర్వాత ఒకరిని బయటకు తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఆర్‌ఎఫ్‌) ఓ వీడియో విడుదల చేసింది. వెల్డింగ్‌ చేసిన పైపులో స్ట్రెచర్‌ మీద కార్మికులు వెల్లికిలా పడుకొని ఉంటే దానిని తాడుతో బయటకు లాగనున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... ఈ సమస్య ఉత్పన్నమైన వెంటనే దీనికోసం అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు అర్నాల్డ్ ఘటనా స్థలంలో ఏర్పాటు చేసిన దేవతా విగ్రహాలకు నమస్కరించారు. తాము చేస్తోన్న ప్రయత్నాల్లో ఎటువంటి అడ్డంకులూ రాకూడదని ఆయన దేవుడిని వేడుకున్నాడు! దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

కాగా... కాగా నవంబర్‌ 12న టన్నెల్‌ లోని కొంతభాగం కూలడంతో 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సహాయక చర్యలు సాగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో వాటికి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. డ్రిల్లింగ్‌ సమయంలో రాళ్లు కులడం, ఇనుప పైపు లైన్లు అడ్డురావడదం వంటివి కార్మికులను రక్షించే విషయంలో సవాలుగా మారుతున్నాయి.

ఇప్పటికే చిన్న చిన్న పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు ఆహారం, మంచి నీరు, మందులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల స్టీల్‌ పైపు ద్వారా చిన్న కెమెరాను లొపలికి పంపించడంతో సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ముఖాలు తొలిసారి కనిపించాయి!